|
|
Articles: TP Features | 'టి' ఎందుకు ఇస్తుందంటే.. - Site Administrator
| |
దేశంలో పెద్ద రాష్ట్రాలు బలం సంతరించుకుని పలు విషయాల్లో కేంద్రానికి తలనొప్పిగా మారుతున్నాయి. తమిళనాడు నుండి కరుణానిధి, జయలలిత, పశ్చిమబెంగాల్ నుండి జ్యోతిబసు, మమతా బెనర్జీ, ఆంధ్ర్రప్రదేశ్ నుండి ఎన్.టి.ఆర్., చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డి తదితరులు మహారాష్ట్ర నుండి శరద్ పవార్, బీహార్ లో లాలూప్రసాద్, యూపీలో మాయావతి, గుజరాత్ లో నరేంద్ర మోడి తదితరులు కేంద్రంతో వ్యవహరించిన తీరు అందరికీ తెలిసిందే. కేంద్రం ఎప్పుడూ తాను బలంగా ఉండి తన క్రింద రాష్ట్రాలు అణిగిమణిగి ఉండి, ఆదేశాలు స్వీకరిస్తూ త.చ. తప్పకుండా అమలు పరిచేలా ఉండాలని కోరుకుంటాయి.
తెలంగాణ పట్ల కేంద్రం సానుకూలంగా ఉందా?!
కేంద్రం ఆదేశాలను ఖాతరు చేయకుండా, బ్లాక్ మెయిల్ చేస్తూ, విమర్శిస్తూ, ప్రశ్నిస్తూ, అస్థిర పరుస్తామని బెదిరిస్తూ, అధికారంలో అధిక వాటా కోరుతూ ఉండడాన్ని కేంద్ర ప్రభుత్వాలు సహించవు. రాచరికం కానీ, ఫెడరల్ విధానం కానీ, ఫ్యూడల్ ధోరణి కానీ, ప్రజాస్వామ్యం కానీ ఇంకొక రీతి కాని క్రింది వారు బలంగా ఉండి ప్రశ్నించడాన్ని పైవారు ఎప్పుడూ సహించరు. సరిగ్గా ఇందువల్లనే కేంద్రం దేశంలో పెద్ద రాష్ట్రాలు లేకుండా ప్రయత్నిస్తున్నదని సూత్రీకరించడానికి వీలుకలుగుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వాల అండతో రాజకీయ బేహారులు, అక్రమ వ్యాపారులు విపరీతంగా డబ్బు సంపాదించి రాజకీయాల్లో చేరి, ఇటు రాష్ట్ర రాజకీయాలను, అటు పార్లమెంట్ సభ్యులను ప్రభావితం చేస్తూ బోలెడంత చిరాకు పరుస్తున్నారు. బహుశా ఇలాంటి వారు మున్ముందు పుట్టుకు రాకుండా ఉండేందుకు ఉన్న వారిని సైజు తగ్గించడానికి పెద్ద రాష్ట్రాలను కేంద్రం విడకొట్టాలని అనుకుంటుందని భావించడానికి కొంత ఆస్కారం ఉంది.
42 పార్లమెంట్ స్థానాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కొన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని శాసించగలుగుతున్నది. మరి కొన్నిసార్లు కార్నర్ చేసి మెడలు వంచి తన ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నది. ఇలాంటి పరిస్థితులను కనీస స్థాయికి తగ్గించుకోవాలని కేంద్రం భావించినందు వల్ల కూడా రాష్ట్రం రెండుగా మారే పరిస్థితి ఏర్పడింది.
కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా తమిళనాడు వారు వ్యూహాత్మకంగా తమకు కావాల్సిన రీతిలో పనులు చేయించుకుంటూ, పొందాల్సిన వాటికన్నా ఎక్కువ కేంద్ర మంత్రి పదవులు పొందుతూ ఉన్నారు. జనతాపార్టీ అధికారంలో ఉన్నప్పుడు జయలలిత అయినా, చంద్రబాబు అయినా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కరుణానిధి అయినా చేసిన పని ఇదే. రాష్ట్రాలు ఇలా ఎక్కువ అధికారాన్ని, బలాన్ని సంతరించుకోవడం కేంద్రానికి ఇష్టం ఉండదు. ఈ కారణం వల్ల బహుశా కేంద్రం తెలంగాణా విషయంలో కొంత సానుకూల ధోరణి ప్రదర్శించే అవకాశం ఉంది.
| Read 5 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|