దొనకొండలో క్షిపణి తయారీ యూనిట్ Amaravati, July 20: ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతంలో దాదాపు వంద ఎకరాల్లో క్షిపణి తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది.
భారత రక్షణకు శాఖ చెందిన డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవల్‌పమెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) ప్రతినిధుల బృందం ఆదివారం ఈ ప్రాంతంలో పర్యటించింది.
వారు అక్కడి భౌగోళిక పరిస్థితులు, రహదారి వసతులు, భద్రతా పరంగా అనుకూలత వంటి అంశాలను పరిశీలించినట్టు సమాచారం. దొనకొండ ప్రాంతంలో భూమి లభ్యత, ప్రాథమిక మౌలిక సదుపాయాల పరిస్థితి, విద్యుత్ మరియు నీటి వనరులపై అధికారులు సమగ్రంగా సమాచారం సేకరించారు.
ఈ యూనిట్ ఏర్పడితే ఉద్యోగ అవకాశాలు కలిగే అవకాశం ఉండటంతో స్థానికంగా ఆసక్తి నెలకొంది. అలాగే దొనకొండ ప్రాంతానికి కొత్త పారిశ్రామిక ప్రాధాన్యం ఏర్పడే అవకాశముందని భావిస్తున్నారు.
News Posted: 20 July, 2025
|