చిరు క్లాప్ తో శ్రీకాంత్ 'మహాత్మ'
'పీపుల్స్ ఎన్ కౌంటర్' ద్వారా పరిశ్రమలోకి అడుగుపెట్టిన శ్రీకాంత్ నూరవ చిత్రం మైలురాయికి చేరుకున్నారు. ఆయన సెంచరీ ఫిల్మ్ గా 'మహాత్మ'కు శ్రీకారం చుట్టారు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దరశకత్వంలో గోల్డెన్ లయన్ ఫిలిమ్స్ పతాకంపై సి.ఆర్.మనోహర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గచ్చీబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీ వద్ద ఆదివారం ఉదయం ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. జాతీయ పతాకం రంగుల వెనుక నుండి గాయపడిన గాంధీని చేతులపై మోసుకు వస్తూ వందేమాతరం అంటూ శ్రీకాంత్ పలకడాన్ని తొలి సన్నివేశంగా చిత్రీకరించారు. శ్రీకాంత్ సన్నిహితుడు, మెగాస్టార్ చిరంజీవి ఈ తొలి సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. డాక్టర్ దాసరి నారాయణరావు కెమెరా స్విచ్చాన్ చేశారు. కె.రాఘువేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. డి.రామానాయుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తదితర ప్రముఖులు ఈ సందర్భంగా హాజరయ్యారు.
రాజకీయ ప్రచారం మధ్యలో సినిమా సంబంధిత ఈవెంట్ లో పాల్గొనడం తెలుగు సినీ కళామతల్లి పాదాలను తాకిన ఫీలింగ్ కలుగుతోందని చిరంజీవి పేర్కొన్నారు. శ్రీకాంత్ 100 చిత్రాల్లో నటించడం సంతోషంగా ఉందనీ, ఆయన కెరీర్ లోనే ఇది బెస్ట్ ఫిల్మ్ గా నిలవాలని కోరుకుంటున్నాననీ అన్నారు. తెలుగు సినిమా క్రియేటివ్ డైరక్టర్లలో ఒకరైన కృష్ణవంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం అభినందనీయమని అన్నారు. శ్రీకాంత్ జీవితంలో ఇది మరపురాని రోజనీ, ఒక్కో మెట్లు ఎక్కుతూ వంద సినిమాలకు చేరుకున్నాడనీ,
మహాత్మ ప్రారంభోత్సవానికి వంద సినిమాలు పూర్తి చేసిన అందరినీ కృష్ణవంశీ ఆహ్వానించడం అభినందనీయమని అన్నారు. కృష్ణవంశీ మాట్లాడుతూ, సహజంగా తన సినిమాల ప్రారంభోత్సానికి ఎలాంటి ఫంక్షన్లు జరపననీ, అయితే ఇది శ్రీకాంత్ 100వ సినిమా కావడంతో ప్రత్యేక అకేషన్ గా భావించాననీ చెప్పారు. వంద చిత్రాలు పూర్తి చేసే చివరి హీరో శ్రీకాంత్ అవుతాడని అన్నారు. గాందీ తత్వం అరవై ఏళ్ల తర్వాత ఎలా ఉంది? బాధ్యతాయుతమైన పౌరులు ఏం చేయాలనే దానిని ఈ చిత్రంలో ఆవిష్కరించనున్నట్టు చెప్పారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|