శోభ సారీ చెప్పాలి : మా
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సినీనటి రోజాపై, ప్రజారాజ్యం మహిళా విభాగం అధ్యక్షురాలు శోభారాణి చేసిన విమర్శలను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఖండించింది. శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా ఆసోసియేషన్ అధ్యక్షుడు మురళీమోహన్ మాట్లాడుతూ, శోభారాణి వెంటనే క్షమాపణ చెప్పాలని అన్నారు.
చదవుకున్న వ్యక్తిగా, సెన్సార్ బోర్డు సభ్యురాలిగా పని చేసిన శోభారాణి ఒక నటిని పరుషపదజాలంతో దూషించడం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు. 'మేమంతా సినిమాలలో మాత్రమే నటిస్తాం, బ్లూఫిల్ములలో కాదు. సెన్సార్ బోర్డు నిబంధనలకు అనుగుణంగానే సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందనీ, ఆమోదించిన సన్నివేశాలే బయట ప్రదర్శనకు వస్తాయన్న విషయం కూడా అమెకు తెలుసు. పాత్రలు వేరు నిజజీవితం వేరు. విలన్ పాత్రలలో నచింటినంతమాత్రాన నిజజీవితంలో విలన్లు కారు. అలాగే వ్యాంప్ పాత్రలో నచిటించినవారంతా చెడ్డవారు కాదు. హీరోల పాత్రలు పోషించినవారంతా హీరోలూ కాదనీ' అన్నారు. తెలుగు చలన చిత్రానికి చెందిన నటులు ఎవరెవరు ఏ పార్టీలలో ఉన్నా వ్యక్తిగత దూషణలు మానుకోవాలన్నారు. ఇలాంటి ధోరణులను అరికట్టేందుకు అందరూ బాధ్యతగా పూనుకోవాలన్నారు. ఇప్పటికే రోజా క్షమాపణ చెప్పింది, అలాగే శోభారాణి కూడా తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని, క్షమాపణ చెప్పాలని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|