ఉగాదికి 'మినీ' ఫిల్మ్ ఫెస్ట్
సంక్రాంతి తర్వాత సహజంగా ఫిల్మ్ మేకర్స్ దృష్టంతా సమ్మర్ సీజన్ పైనే ఉంటుంది. అయితే సమ్మర్ సీజన్ లో పెద్ద హీరోలు, పెద్ద నిర్మాణ సంస్థల పోటీ ఎక్కువగా ఉంటుంది. దీంతో చిన్న నిర్మాతలు కాస్తంత ముందుగానే, వెనకగానే తమ సినిమాలను ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంటుంది. అనూహ్యంగా ఈసారి ఉగాది పండుగ ప్రత్యేకతను సంతరించుకుంటోంది. ఉగాది రోజైన ఈనెల 27న అరడజనుకు పైగా సినిమాలు ఏకకాలంలో పోటీపడుతూ మినీ ఫిల్మ్ ఫెస్టివల్ ను తలపించబోతున్నాయి.
బిల్లా
ప్రభాస్, అనుష్క, నమిత ప్రధాన పాత్రల్లో గోపీకృష్ణా మూవీస్ పతాకంపై యు.కృష్ణంరాజు నిర్మిస్తున్న 'బిల్లా' చిత్రం ఉగాదిని టార్గెట్ చేసుకుంది. 'కంత్రీ' ఫేమ్ మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తమిళ 'బిల్లా'కు రీమేక్ గా ఈ చిత్రం ఉండబోతోంది.
మనోరమ
ఛార్మింగ్ నటి ఛార్మి కథానాయికగా జీ మేషన్ పిక్చర్స్ నిర్మిస్తున్న 'మనోరమ' చిత్రాన్ని ఈనెల 27న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తొలిచిత్రం 'మీ శ్రేయాభిలాషి' తో అవార్డులు, రివార్డులు కూడా తెచ్చిపెట్టిన ఈశ్వర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు.
డైరీ
శివాజీ, శ్రద్ధాదాస్, సజిత హీరోహీరోయిన్లుగా జెన్ నెక్ట్స్ మూవీస్, గ్రేట్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా మచ్కకంటి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందించిన 'డైరీ' చిత్రాన్ని ఉగాది రోజునే విడుదలకు సిద్ధం చేశారు. సూపర్ హిట్ 'మంత్ర' కు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కింది.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|