టార్గెట్ చేరిన 'మేస్త్రి' : దాసరి
'మేస్త్రి' చిత్రాన్ని తీసిన ఉద్దేశం, లక్ష్యం రెండూ పూర్తిగా నెరవేరాయని ఆ చిత్రంలో టైటిల్ టైటిల్ పాత్ర పోషించిన దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు పేర్కొన్నారు. సురేష్ కృష్ణ దర్శకత్వంలో దాసర పద్మ సమర్పకురాలిగా సిరి మీడియో ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కె.రామకృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం సకెస్స్ మీట్ ను దాసరి హైద్రాబాద్ లోని తన స్వగృహంలో బుధవారంనాడు ఏర్పాటు చేశారు. డాక్టర్ మోహన్ బాబు, సురేష్ కృష్ణ, రాజ్యసభ మాజీ సభ్యుడు యార్గగడ్డ లక్ష్మీప్రసాద్, గీత రచయిత సుద్దాల అశోక్ తేజ, కె.రామకృష్ణ ప్రసాద్, నటుడు మాగంటి సుధాకర్ తదితరులు ఈ సందర్భంగా పాల్గొన్నారు.
టెన్త్ , ఇంటర్మీడియట్ పరీక్షల సమయంలో సినిమా విడుదలైనప్పటికీ మంచి ప్రేక్షకాదరణ లభించిందనీ, ఇప్పుడు పరీక్షలు అయిపోయినందున పెద్దవాళ్లు సైతం పిల్లలతో కలిసి థియేటర్లకు వస్తుండటంతో కలెక్షన్లు మరింత పెరిగాయనీ దాసరి తెలిపారు. 106 థియేటర్లలో 30 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకుని అర్ధ శతదినోత్సవానికి పరుగులు తీస్తోందని అన్నారు. ఓటు విలువలను తెలియజేస్తూ మంచి నాయకులను ఎన్నుకోమని ఈ చిత్రంలో చూపించామనీ, ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, సారాకో, నోటుకో, చీర, జాకట్లకో ఓటు అమ్ముకోవద్దనే అంశాలను ఇందులో ఆవిష్కరించామనీ చెప్పారు. అలాగే పోలింగ్ రోజు హాలిడే ఇస్తే దానిని జాలీడేగా మార్చుకుని ఓటు వేయకపోవడం దేశద్రోహమని కూడా చెప్పామన్నారు. సుద్దాల అశోక్ తేజ రాసిన పాటలో ఈ అంశాలు ముచ్చటించామనీ, ఇక మోహన్ బాబు ప్రత్యేక పాత్రలో 20 నిమిషాల పాటు అద్భుతమైన నటనా ప్రతిభను చూపారని అన్నారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|