'పున్నమినాగు' రివ్యూ
భూలోకం ముంగిట మహాప్రళయం పొంచి ఉందనీ, సరిగ్గా పాతికేళ్లకు ఈ ప్రళయం సంభవించి ప్రపంచం సర్వనాశనమవుతుందని నాగలోకాధిపతి నాగరాజు జోస్యం చెబుతాడు. అయితే మానవాళికి మేలు చేయడమే తమ జాతి కర్తవ్యంగా భావించి ఇద్దరు నాగ దేవతలను (పాములు) పిలిపిస్తాడు. ఆ ఇద్దరూ తమ నృత్యంతో శివుడ్ని మెప్పిస్తే అంతరించిన నాగమణులు మళ్లీ నాగజాతి వశమవుతాయనీ, వాటిని శివునికి సమర్పించి ప్రళయాన్ని నివారించవచ్చనీ ఉపాయం చెబుతాడు. ఆ రెండు పాములూ (ఆదిత్య ఓం...ముమైత్) కాళహస్తి సమీపంలో తమ నృత్యంతో శివుని మెప్పించే ప్రయత్నం చేస్తుండగా కొందరు స్మగర్లు చూస్తారు. జంట పాముల వద్ద ఉన్న నాగమణి కోసం కాల్పులు జరుపుతారు. మగపాము మరణిస్తుంది. మంత్రగత్తె కజరి (నళిని) సాయంతో ఒక నాగమణిని స్మగర్లు దక్కుంచుకుంటారు. ఆడపాము తప్పించుకుంటుంది. ఆ పామును కూడా చంపి రెండో మణి వశం చేసుకుంటే ప్రపంచాధిపత్యం తన వశమవుతుందని కజరి పన్నాగాలు పన్నుతుంటుంది. మరోవైపు ఆడపాము తన ప్రియుడ్ని కోల్పోయి ప్రతీకారంతో రగిలిపోతుంటుంది. నేరుగా కాటువేస్తే మహిమలు కోల్పోయే ప్రమాదం ఉందని నాగరాజు హెచ్చరించడంతో మానవ దేహాన్ని ఆశ్రయించి ప్రతీకారం తీర్చుకునేందుకు నాగిని ఎదురుచూస్తుంటుంది. ఇదే తరుణంలో రెండో నాగమణి కావాలంటే నాగచిహ్నాలతో ఉన్న అమ్మాయి వల్లే సాధ్యమవుతుందని కజిరి తన మంత్ర శక్తులతో తెలుసుకుంటుంది. ఒక పోలీసు అధికారి (నిళల్ గళ్ రవి) కూతురికి (ముమైత్) సరిగ్గా అలాంటి లక్షణాలే ఉంటాయి. ఆ అమ్మాయిని తన దగ్గరకు రప్పించాలని కజరి ప్రయత్నిస్తున్న సమయంలో ఆమె శరీరంలోకి నాగిని ప్రవేశిస్తుంది. నాగిని ప్రతీకారం తీరిందా? కజరి ప్రయత్నం ఏమైంది? మహాప్రళయాన్ని నాగిని ఆపగలిగిందా అనేది మిగతా కథ.
Be first to comment on this News / Article!
Pages: -1- 2 -3-
|