'పున్నమినాగు' రివ్యూ
దర్శకుడు కోదండరామిరెడ్డి కథనం ప్రేక్షకులను అసహనానికి గురిచేస్తుంది. ముందు చెప్పే విషయం వెనక, వెనుక చెప్పే విషయం ముందు అన్నట్టుగా కథాగమనం సాగడం వల్ల నాగిన్ ఎవరో, మరో ముమైత్ ఎవరో ప్రేక్షకుడికి చాలాసేపు వరకూ అర్ధం కాదు. ఇద్దరూ ఒకటేనా? వేర్వారా? అనేది అర్ధం చేసుకోవడానికి సినిమాలోని ముప్పాతికి వంతు చూడాల్సిందే. దీనికి తోడు కథ ఎప్పటికీ సీరియస్ ట్రాక్ లో వెళ్లకుండా రాజీవ్ కనకాల, సుహాసినిలపై దర్శకుడు నడిపిన 'చీప్' కామెడీ అడుగడుగునా అడ్డు తగుల్తూ ప్రేక్షకుల అసహనానికి పరీక్ష అవుతుంది. మగాడి స్పర్శే తెలియని సుహాసినిలో ఆడతనం రెచ్చగొట్టి, తన మగతనం ఏమిటో తెలియజెప్పాలనుకునే వెర్రిమొర్రి వేషాలకే రాజీవ్ కనకాల పాత్ర పరిమితమైంది. ముమైత్ కు సాయపడేలా అతని పాత్రను తీర్చిదిద్ది ఉండే కొంతైనా కథకు న్యాయం జరిగి ఉండేది. ఇలాంటి కథలో ఇంత దిగజారుడు కామెడీ ట్రాక్ (అనొచ్చా?) శోభించదు.'బూతు'తో నెగ్గుకురావాలంటే దానికి దర్శక 'కోదండరాముడే' అవసరం లేదు.
ముమైత్ ద్విపాత్రాభినయం చేయడం ఇది తొలిసారి. రెండు బలమైన పాత్రలు దొరికి కూడా సినిమా మొత్తం మైక్రో స్కర్ట్ లు, బిగుతు దుస్తులతోనే కనిపించి ఆ పాత్రలకు సరైన హుందాతనం తేలేకపోయింది. ఉన్నంతలో నాగిని పాత్రలో నటన కొద్దిగా బెటర్. 'రగులుతోంది మొగలిపొద' (రీమిక్స్) అంటూ సాగే బికినీ సాంగ్ సైతం ప్రేక్షకులు ఆశించిన కిక్ ఇవ్వదు. రాజీవ్ కనకాల 'మదపిచ్చి' భర్త పాత్రలో చేసిన నటన, హావభావాలు నవ్వు రావడం మాటెలా ఉన్నా అతనిపై జాలి కలుగుతుంది. ముఖ్యంగా 'వయాగ్రా' వాడకం సమయంలో చేసిన చేష్టలు బహుశా ఈ సినిమాను 'ఎ' సర్టిఫికెట్ కు అర్హంగా చేసుంటాయి. అతనికి జోడిగా సుహాసిని కొంతవరకూ బ్యాలెన్సింగ్ గా చేసింది.
మంత్రగత్తెగా నళిని ఫరవాలేదు. కమెడియన్ శ్రీనివాసరెడ్డి చేత డబుల్ మీనింగ్ డైలాగ్ లు ఆలవోకగా చెప్పించేశారు. వినోద్ కుమార్, నిళల్ గళ్ రవి పాత్రలకు పెద్ద ప్రాధాన్యం లేదు.
సాంకేతిక పరంగా ఏ విభాగాన్ని భుజం తట్టలేం. గ్రాఫిక్స్ కు మంచి స్కోప్ ఉన్నప్పటికీ సరిగా ఉపయోగించుకోలేదనే చెప్పాలి. వెలిగొండ శ్రీనివాస్ ద్వంద్వార్ధ సంభాషణలను విచ్చలవిడిగా ప్రయోగించారు. 'చెడ్డీలో ఐస్ ముక్క వేస్తే ఇక ఊపుడే ఊపుడు', 'ఈరోజు మంచం విరిగిపోవాలి...కాదు..చాప చరిగిపోవాలి', 'దేశభక్తికి బేధాలు లేనట్టే శృంగారానికి లింగ బేధాలు లేవు' (ఔరా?), 'ఈ మధ్యన జనం ఢిల్లీకి వయా..ఆగ్రా ద్వారానే వెళ్తున్నారు' (వయాగ్రాకి వచ్చిన తిప్పలులెండి), 'ఆడామగా వచ్చారు...ఎవరు మాడా' వంటివి సంభాషణలు ఈ కోవలేనివే. జీవా శంకర్ సినిమాటోగ్రఫీ డల్ గా ఉంది. ఎస్.ఎ.రాజ్ కుమార్ స్వరపరచిన ట్యూన్స్ క్యాచీగా లేదు. వి.టి.విజయన్ ఎడిటింగ్ మరింత మెరుగ్గా ఉండాల్సింది. నిర్మాణ విలువలూ అంతంతమాత్రమే.
సినిమా ప్రథమార్థం, ద్వితీయార్థం అనే ప్రమేయం లేకుండా సినిమాలో ఏ దశలోనూ ప్రేక్షకుడు కనెక్ట్ కాలేడు. ముమైత్ ఎక్స్ పోజింగ్, పబ్లిసిటీ మెటీరియల్ చూసి క్యూరియాసిటీ పెంచుకుంటే మిగిలేది నిరాశే. చివరి సజిషస్ ఏమంటే...ఊరుకున్నంత ఉత్తమం లేదు.

Be first to comment on this News / Article!
Pages: -1- -2- 3
|