జీవన మధురిమల 'యు & ఐ'
జీవితంలో ఒక్కోసారి ఉన్నత లక్ష్యాల సాధనలో పడి చిన్నచిన్న ఆనందాలను కోల్పోతుంటాం. అయితే అలాంటి చిన్న చిన్న ఆనందాలను కూడా సొంతం చేసుకున్నప్పుడే జీవితంలోని మాధుర్యం తేటతెల్లమవుతుది. అలాంటి 'స్మాల్ ప్లెజర్స్'కు అర్ధవంతమైన సెల్యులాయెడ్ రూపమే 'యు అండ్ ఐ'. న్యూజెర్సీలోని ప్రముఖ కన్సెల్టింగ్ సంస్థ (జెఎస్ఎంఎన్) అధినేత, తెలుగు ప్రముఖుడు రవీందర్ తోట తొలిసారిగా ఈ చిత్రాన్ని జెఎస్ఎంఎన్ సినిమా బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉంటూ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేసిన యువ ప్రతిభావంతుడు రంజిత్ బెల్లూరి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తెలుగు కుర్రాడు రోహన్, ఉత్తరాది అమ్మాయి అదితి చౌదరి హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. గత డిసెంబర్ లో ముహూర్తం జరుపుకొన్న ఈ చిత్రం శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటోంది. ఇంతవరకూ 95 శాతం షూటింగ్ పూర్తయిందనీ, బ్యాలెన్స్ వర్క్ కూడా అతి త్వరలోనే పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నామనీ రంజిత్ బెల్లూరి తొలిసారి 'యు అండ్ ఐ' ప్రోగ్రస్ ను 'తెలుగుపీపుల్'కు తెలియజేశారు.
'యు అండ్ ఐ...అంటే ఇద్దరి మధ్యే నడిచే కథ. నిజానికి ఇందులో కథానాయకుడు, కథానాయిక చుట్టూనే కథ ఉంటుంది. యూత్ కు స్ట్రయిగా రీచ్ అవుతుంది. అందుకే స్టోరీకి తగ్గ టైటిల్ ను ఎంచుకున్నాం. సినిమా ముహూర్తం సమయంలోనే టైటిల్, పోస్టర్లు చూసి పలువురు సినీ ప్రముఖులు నా భుజం తట్టారు. నాలో మరింత కొత్త ఉత్సాహాన్ని నింపారు. అందుకు తగ్గట్టే సినిమా చాలా బాగా వచ్చింది. తెలుగులో వచ్చే రెగ్యులర్ ఫార్మాలా చిత్రాల స్టఫ్ మాత్రం ఇందులో ఉండదు. ఈ చిత్రంలోని స్పెషాలిటీ అదే. కచ్చితంగా క్వాలిటీ తెలుగు ఫిల్మ్ కు కొత్త నిర్వచనం చెప్పబోతున్నాం' అని దర్శకుడు తెలిపారు. రోహన్ తన మిత్రుడే అయినప్పటికీ సెట్స్ పైకి వచ్చే సరికి తన శిష్యుడుగా ఆ పాత్రలో ఒదిగిపోయి ఎంతో చక్కగా నటించాడనీ, అదితి చౌదరి కోసమే ఇందులోని హీరోయిన్ పాత్ర పుట్టిందా అన్నట్టుగా ఆమె పాత్ర అంత సజీవంగా ఉంటుందనీ, ఎంతో ఓర్పుగా ఆ పాత్రను అవగాహన చేసుకుంటూ తన అంచనాలకు మించి అదితి చౌదరి నటించిందనీ తెలిపారు. అరకు, కోటి గోకుల్ ఛాట్, గోల్కొండ, చిలుకూరు, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ వంటి చక్కటి లొకేషన్లలో షూటింగ్ జరిపామనీ, సంగీత దర్శకుడు కార్తీక్ ఎం అద్భుతమైన సంగీతం ఈ సినిమాకి మరో ప్రధానమైన ఎస్సెట్ అవుతుందన్నారు. ఇందులో ఒక లవ్ సాంగ్, ఒక క్లాస్ రూమ్ సాంగ్, ర్యాప్ సాంగ్, డిస్కోసాంగ్...ఇలా ఐదు పాటలు సిట్యూయేషనల్ గా ఉంటాయనీ, తాను ఒక పాట, రెండు బిట్ సాంగ్స్ రాశాననీ, అనంత్ సాయిరాం 4 అద్భుతమైన పాటలకు సాహిత్యం అందించారనీ చెప్పారు. అలాగే ఈ సినిమాకి శంకర్ కె అందించిన ఫోటోగ్రఫీ మార్వెలెస్ అని అభివర్ణించారు. ప్రతి షాట్ ఒక పెయింటింగ్ లా ఉంటుందని అన్నారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|