సుమంత్ 'బోణి' పాటలు
సుమంత్ కథానాయకుడుగా రూపొందుతున్న తాజా చిత్రం 'బోణి'. ప్రముఖ సంగీత దర్శకుడు రమణ గోగుల తన అభిరుచికి అనుగుణంగా గ్రీన్ మ్యాంగోస్ అనే సంస్థను స్థాపించి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమెరికాలో ఇంజనీర్ గా పనిచేసిన రాజ్ పిప్పళ్ల ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కృతి కథానాయికగా పరిచయవుతోంది. ఈ చిత్రం ఆడియో వేడుక హైటెక్స్ లోని నోవాటెల్ లో సోమవారం రాత్రి కన్నులపండువగా జరిగింది. కోటి, మణిశర్మ, ఆర్.పి.పట్నాయక్, చక్రి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. లగడపాటి శ్రీధర్, జయంత్ సైతం ఈ వేడుకకు హాజరయ్యారు. ఆడియో సీడీలను చక్రి ఆవిష్కరించి తొలి ప్రతిని సుమంత్ కు అందజేశారు. రమణ గోగుల సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైంది.
కోటి మాట్లాడుతూ, రమణ గోగుల ఈ చిత్రం కోసం ఎంతో కష్టపడ్డారనీ, అందుకు తగ్గ ఫలితం వస్తుందనీ అన్నారు. పాటల రికార్డింగ్ తన రికార్డింగ్ థియేటర్లోనే జరిగిందనీ, ఆ సమయంలోనే పాటలు విన్నాననీ, ఆడియో పెద్ద విజయం సాధించడం ఖాయమనీ ఆర్.పి.పట్నాయక్ పేర్కొన్నారు. చక్రి మాట్లాడుతూ, రమణ గోగుల నిర్మాతగా తమందరికీ స్ఫూర్తిగా నిలిచారనీ అన్నారు. మామిడిపండ్ల కాలంలో రాబోతున్న ఈ చిత్రం బంపర్ విజయం సాధించాలని జయంత్ ఆకాంక్షించగా, సినిమా పోస్టర్లు చూసిన కొద్దీ చూడాలనిపిస్తున్నాయనీ, పోస్టర్లే ఇలా ఉంటే సినిమా ఇంకెంత వైవిధ్యంగా ఉంటుందో ఊహించవచ్చని లగడపాటి శ్రీధర్ ప్రశంసించారు. రమణ గోగుల మాట్లాడుతూ, సంగీత దర్శకుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టి ఈ రోజు నిర్మాతగా మారాననీ, సినిమాకి కథ ఎలాంటిందో మంచి సాకేంతిక నిపుణులు కూడా అంతే ముఖ్యమనీ, ఈ చిత్రానికీ అన్నీ బాగా కుదిరాయనీ చెప్పారు. ఏడాది పాటు కష్టపడి పనిచేశామనీ, అలాగే పాటలన్నీ మన తెలుగు గాయనీగాయకులతోనే పాడించాననీ తెలిపారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|