దాసరి బర్త్ డే ...అవార్డులు
దర్శకరత్న దాసరి నారాయణరావు 63వ జన్మదినోత్సవాన్ని వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్వంలో ఘనంగా నిర్వహించనున్నట్టు ఆ సంస్థ కన్వీనర్ వంశీ రామరాజు ప్రకటించారు. హైద్రాబాద్ లోని ఫిలిం చాంబర్ లో బుదవారంనాడు ఆ వివారాలను తెలియజేశారు. తమ సంస్థ గతంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా భారీ ఎత్తున దాసరి జన్మదినోత్సవాన్ని జరుపనుందని అన్నారు. మే 4వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు హైద్రాబాద్ లోని రవీంద్రభారతిలో ఈ వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు. దీనికి డివిఎస్ రాజు అధ్యక్షత వహిస్తారని, డాక్టర్ సి.నారాయణరెడ్డి సభను ప్రారంభిస్తారని, శ్రీమతి జయసుధ జ్యోతి ప్రజ్వలన చేస్తారనీ చెప్పారు. యార్గగడ్డ లక్ష్మీప్రసాద్, ఎంఎస్ రెడ్డి, డి.రామానాయుడు, తమ్మారెడ్డి కృష్ణమూర్తి, కె.రాఘువేంద్రరావు, డాక్టర్ ఎం.మోహన్ బాబు, ఎం.మురళీమోహన్, రేలంగి నరసింహారావు తదితురులు పాల్గొంటారని తెలిపారు.
134 మంది కార్మికులకు సత్కారం
దాసరి జన్మదిన వేడుకల్లో భాగంగా గత ఏడాది 148 మంది దర్శకులు, 129 మంది నిర్మాతలను సత్కరించినట్టే ఈ ఏడాది పరిశ్రమలోని 24 క్రాఫ్టులకు చెందిన 134 మంది సీనియర్ కార్మికులను సత్కరించనున్నట్టు దాసరి జన్మదినోత్సవ కమిటీ చైర్మన్ తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. ఇదొక అపూర్వ ఘట్టంగా నిలిచిపోతుందని చెప్పారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|