మెస్మరైజ్ చేసే 'మల్లన్న'
కమర్షియల్ అంశాలతో పాటు సందేశాన్ని మిళితం చేసి రూపొందించిన 'మల్లన్న' (సూపర్ హీరో) చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుందని ఆ చిత్ర కథానాయకుడు విక్రమ్ తెలిపారు. వి.క్రియేషన్స్ పతాకంపై సుశీ గణేషన్ దర్శకత్వంలో కలైపులి ఎస్.థాను ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి కావచ్చాయి. తమిళంలో 'కందసామి' పేరుతో ఈ చిత్రం రూపొందింది. ఈనెల 19న ఆడియో, జూన్ లో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో సోమవారం ఆ విశేషాలను చిత్రయూనిట్ తెలియజేసింది. విక్రమ్, సుశీ గణేషన్, కలైపులి థాను, చిత్ర సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్, సీనియర్ నిర్మాత సి.కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
విక్రమ్ మాట్లాడుతూ, మంచి క్వాలిటీ చిత్రాన్ని అందించాలనే తపనతో ఒకటిన్నర సంవత్సరాల పాటు ఈ చిత్ర నిర్మాణం జరిగిందనీ, సహజత్వానికి దగ్గరగా ఉన్న కథ ఇదనీ చెప్పారు. ఇందులో తాను విభిన్నమైన గెటప్స్ వేశాననీ, రిచ్ లొకేషన్లలో షూటింగ్ జరిగిందనీ చెప్పారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా ఎక్కువ సమయమే తీసుకున్నందున సినిమా విడుదలకు ఎక్కువ సమయం పట్టిందన్నారు. ఈ చిత్రం తమిళ, తెలుగు వెర్షన్లలో 4 పాటలు పాడానని చెప్పారు. ఇలాంటి గొప్ప చిత్రంలో నటించడం గర్వంగా ఉందనీ, ఏరకంగా చూసినా ఇదో మంచి ట్రెండ్ సెట్టర్ అవుతుందనీ పేర్కొన్నారు. సుశీ గణేషన్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి ఏభై ఏళ్లు పూర్తయినా ధనవంతులు ఇంకా ధనవంతులవుతుంటే, పేదవారు మరింత పేదలుగా మిగిలిపోతున్నారనీ, ఈ వ్యత్యాసాన్ని సినిమాలో చర్చించామని చెప్పారు. విక్రమ్ ఎంతో ప్రతిభావంతుడనీ, ఏ పాత్ర పోషించినా అందులో ఇమిడిపోతుంటారని ప్రశంసించారు. మల్లన్న పాత్రతో పాటు ఇతర గెటప్స్ లోనూ అద్భుతంగా నటించారనీ, అభిరుచి గల నిర్మాత దొరకడంతో ఎంతో భారీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించగలిగామని చెప్పారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|