మిత్రుడుకు ఆదరణ: బాలయ్య
బాలకృష్ణ కేవలం 23 నిమిషాల పాటు కథ విని నటించేందుకు అంగీకరించారనీ, ఓ పెద్ద హీరో తనలాంటి కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వడం ఎన్నటికీ మరిచిపోలేననీ దర్శకుడు మహేదేవ్ అన్నారు. నిర్మాత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, బాలకృష్ణతో తమ సంస్థ విభిన్న చిత్రాలు నిర్మించడానికి ఆయన అందిస్తున్న సంపూర్ణ సహకారమే కారణమని ప్రశంసించారు. బాలకృష్ణ వంటి పెద్ద హీరోతో నటించడం చాలా సంతోషంగా ఉందని ప్రియమణి అన్నారు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తననెంతో ఆకట్టుకున్న చిత్రమిదని ఆమె పేర్కొన్నారు. సీనియర్ నటుడు బాలయ్య, చంద్రమోహన్, కృష్ణభగవాన్, రఘుబాబు, దీపక్, జంబో ఫ్యామిలీకి చెందిన నటీనటులు, ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|