బాలయ్య అవిష్కరించిన 'రైడ్'
నాని, తనీష్, శ్వేత బసు ప్రసాద్, అక్ష హీరోహీరోయిన్లుగా రమేష్ వర్మ దర్శకత్వంలో శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ నిర్మించిన చిత్రం 'రైడ్. సింగర్ హేమచంద్ర సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైద్రాబాద్ లోని గ్రీన్ పార్క్ హోటల్ లో గురువారం సాయంత్రం జరిగింది. నందమూరి బాలకృష్ణ, వి.వి.వినాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బాలకృష్ణ ఆడియో సీడీని ఆవిష్కరించి వి.వి.వినాయక్ కూ, ఆడియో క్యాసెట్ ను ఆవిష్కరించి తనీష్ తదితరులకు అందజేశారు. హీరోహీరోయిన్లతో పాటు బెల్లంకొండ సురేష్, రమేష్ వర్మ, మెహర్ రమేష్, ఉప్పలపాటి రవి, అమ్మరాజశేఖర్, భాస్కరభట్ల, రామజోగయ్య శాస్త్రి, హేమచంద్ర, శ్యామ్ కె.నాయుడు తదితరులు పాల్గొన్నారు.
బాలకృష్ణ మాట్లాడుతూ, తన సోదరుని కుమారుడితో రమేష్ వర్మ 'మిత్రుడు' అనే టైటిల్ తో ఓ సినిమా తీయాలని ప్లాన్ చేశాడనీ, అయితే తాను అడగ్గానే ఆ టైటిల్ ను తన తాజా చిత్రానికి ఇచ్చారనీ చెప్పారు. 'మిత్రుడు' చిత్రంలో కూడా హేమచంద్ర ఒక పాట పాడారని తెలిపారు. సినిమాలో పాటలు బాగుంటే సగం విజయం సాధించినట్టేననీ, నిర్మాత మంచి రిలిక్స్ రాయించుకున్నారనీ అన్నారు. ఈ సినిమాలో 'దంచవే మేనత్త కూతురా' అనే తన పాటను రీమేక్స్ చేశారనీ, ఇందుకు చాలా గట్స్ కావాలనీ, బెల్లకొండకు అలాంటి గట్స్ ఉన్నాయనీ అన్నారు. గతంలో ఆయన బ్యానర్ లో కూడా నటించాననీ, ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నాననీ అన్నారు. వినాయక్ మాట్లాడుతూ, బెల్లంకొండ సురేష్ ఇంత చిన్న సినిమా ఎందుకు తీసారా అని తాను అనుకున్నానీ, అయితే ట్రైలర్స్ చూసిన తర్వాత విషయం అర్ధమైందనీ, సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆత్రంగా ఉందనీ అన్నారు. మెహర్ రమేష్ మాట్లాడుతూ, 'బిల్లా' చిత్రంలో ఓ పాటను హేమచంద్ర పాడారనీ, ఈ చిత్రంతో మంచి సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాననీ అన్నారు. సంగీత దర్శకుడిగా తనకు అవకాశమిచ్చిన దర్శకనిర్మాతలకు తన కృతజ్ఞతలని హేమచంద్ర పేర్కొన్నారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|