'ఓయ్' ఆడియో విడుదల
సిద్దార్ధ, షామిలి (నిన్నటి బేబి షామిలి) జంటగా యూనివర్శల్ మీడియా పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న చిత్రం 'ఓయ్'. ఆనంద్ రంగా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం రామానాయుడు స్టూడియోస్ లో శుక్రవారం రాత్రి జరిగింది. దర్శకేంద్రుడు కె.రాఘువేంద్రరావు, డి.సురేష్ బాబు, రాజమౌళి, కె.ఎస్.రామారావు, శ్రీనువైట్ల, బొమ్మరిల్లు భాస్కర్, ప్రభాస్, పరుచూరి వెంకటేశ్వరరావు, యువన్ శంకర్ రాజా, ఆనంద్ రంగా, వనమాలి, అనంత్ శ్రీరాం, సునీల్, ఆలీ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఆడియో సీడిని కె.రాఘువేంద్రరావు ఆవిష్కరించి తొలి ప్రతిని రాజమౌళికి అందించారు. ఆడియో క్యాసెట్ ను ప్రభాస్ ఆవిష్కరించి డి.సురేష్ బాబుకు అందజేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.
'బొమ్మరిల్లు' భాస్కర్ మాట్లాడుతూ, ఈ చిత్ర దర్శకుడు ఆనంద్ తన క్లాస్ మేట్ అనీ, తాను చేసిన రెండు సినిమాలకు కో-డైరెక్టర్ గా పనిచేశారనీ చెప్పారు. సిద్దార్ధతో తొలి సినిమా తీసిన దర్శకులంతా ఈ రోజు మంచి పొజిషన్ లో ఉన్నారనీ, ఆనంద్ కూడా దర్శకుడుగా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాననీ అన్నారు. యువన్ శంకర్ రాజా ట్యూన్స్ చాలా ఒరిజనల్ గా ఉన్నాయన్నారు. సిద్దార్ధ వంటి కథానాయకుడు దొరకడం దర్శకుడి అదృష్టమని శ్రీనువైట్ల, రాజమౌళి పేర్కొన్నారు ప్రభాస్ మాట్లాడుతూ, టైటిల్ చాలా బాగుందనీ, ఇందులోని ఒక పాటను సిద్దార్ధ తనకు వినిపించాడనీ, దాదాపు పదిసార్లు విన్నాననీ అన్నారు. సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నానని అన్నారు. సిద్దార్ధ మంచి నటుడని, ఈ సినిమా మంచి సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం తనకుందని సునీల్ అన్నారు. ఇందులో దర్శకుడు తకు మంచి పాత్ర ఇచ్చారనీ, మ్యూజిక్ చాలా బాగా వచ్చిందనీ ఆలీ పేర్కొన్నారు. ఈ చిత్రానికి పనిచేసే అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు యువన్ శంకర్ రాజా కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో 'సరదాగా చందమామని' అంటూ తాను రాసిన పాట మంచి పేరు తెస్తుందని అనంత్ శ్రీరాం పేర్కొన్నారు. ఈ సినిమాలో తాను రాసిన పాటను యువన్ శంకర్ రాజా పాడటం సంతోషంగా ఉందని మరో గీత రచయిత వనమాలి అన్నారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|