'ఎవరైనా ఎపుడైనా' ఆడియో
వరుణ్ సందేశ్, విమలారామన్ జంటగా మార్తాండ్ కె శంకర్ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మక ఎవిఎం సంస్థ నిర్మిస్తున్న 'ఎవరైనా ఎపుడైనా' (ప్రేమలో పడొచ్చు) చిత్రం ఆడియో వేడుక సోమవారం రాత్రి హైద్రాబాద్ లో అహ్లాదకర వాతావరణంలో జరిగింది. చిత్ర యూనిట్ తో సహా పలువురు హీరోలు, దర్శక నిర్మాతలు ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేశారు. ఆడియో సీడీలను ప్రభాస్, గోపీచంద్ ఆవిష్కరించి డాక్టర్ డి.రామానాయుడు, రమేష్ ప్రసాద్ లకు అందజేశారు. ఆడియో క్యాసెట్లను దిల్ రాజు ఆవిష్కరించి తొలి ప్రతిని డి.సురేష్ బాబుకు అందజేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.
సినిమా టైటిల్ కు తగ్గట్టే తమ ప్రేమానుభూతులపై అతిథులు ముచ్చటించి అందర్నీ అహ్లాద పరచారు. గతంలో వెంకటేష్ బాబుతో తాను నిర్మించిన 'ప్రేమ' చిత్రం చక్కటి విజయాన్ని సాధించిందని డి.రామానాయుడు గుర్తు చేశారు. ప్రేమ అనే కథావస్తువు వల్లే చిత్ర పరిశ్రమ ఇంతకాలంగా మనగలుగుతోందని రమేష్ ప్రసాద్ అన్నారు. తేనెలాంటి తెలుగు భాష కూడా ప్రేమకు భాష్యం చెప్పలేదని కోట శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ, దక్షిణాదిన ఉన్న ఎన్నో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఎవీఎం ఒకటనీ, ఏ సినిమా అయినా సమష్ట కృషితోనే ఉంటుందనీ, అయితే దర్శకుడే కెప్టెన్ అనీ అన్నారు. ప్రేమలో పడిన వాళ్లకే ఆ అనుభూతి తెలుస్తుందని ఉదయ్ కిరణ్ పేర్కొనగా, ఎవరైనా ప్రేమలో పడకపోతే ఏదో సమస్య ఉన్నట్టేనని ప్రభాస్ చమత్కరించారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|