'ఆ ఒక్కడు' రివ్యూ
దర్శకుడి స్టోరీలైన్ వినడానికి బాగానే అనిపించినా స్క్రీన్ ప్లే విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుని ఉండొచ్చు. హీరో పాత్ర మొదట్నించీ తగినంత ఎలివేట్ కాకపోవడం కనిపిస్తుంది. హీరోయిన్ పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. ఆమెతో పాటు సలీం, ఎసిపి పాత్రలు కీలకం అవుతాయి. హీరో పాత్రధారికి (అజయ్ కు) చివరి 15 నిమిషాల్లోనే నటించే అవకాశం దొరికింది. టైటల్స్ కు ముందే వచ్చే పార్టే కథకు కీలకమైనప్పుడు ఆ త్రెడ్ తెగిపోకుండా చూస్తూ కథను నడిపించి ఉంటే...క్లైమాక్స్ లో చిక్కుముడులు విప్పేటప్పుడు ప్రేక్షకులు ఈజీగా ఇన్ వాల్స్ అవుతారు. దర్శకుడు ఆ దిశగా కథనంపై పట్టు సాధించి ఉండే బాగుండేది. ప్రథమార్థం సాదాసీదా వ్యవహారంగానే సాగటం, పిచ్చాసుపత్రి పేషంట్లపై నడిపిన కామెడీ ట్రాక్ కథలోని టెంపోను పెంచవు. సునీల్ కామెడీ ట్రాక్ కూడా ఇదే బాట పట్టింది. ఒకసారి బేస్కెట్ బాల్ బంతి పట్టుకుని, ఇంకోసారి పిచ్చాసుపత్రిలో ట్రీట్ మెంట్, మరోసారి పేవ్ మెంట్ మీద కనిపించడం...అసలు హీరోయిన్ చుట్టూ ఎందుకు తిరుగుతాడో అర్ధంకాని పరిస్థితి. దర్శకుడు ఎంచుకున్న సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశానికి ఈ కామెడీ ట్రాక్ కాలిలో ముల్లులా ప్రేక్షకుల అసహనాన్ని పెంచేందుకే ఉపకరిస్తుంది.
నటీనటుల పరంగా మధురిమ అందరినీ డామినేట్ చేసింది. గ్లామర్ తో పాటు నటనకు కూడా ఆస్కారమున్న పాత్రను ఆమె సమర్ధవంతంగా పోషించింది. అజయ్ ను హీరోగా ప్రేక్షకులు రిసీవ్ చేసుకునే స్థాయిలో ఆయన పాత్ర లేదు. మామూలు సినిమాల్లో నిడివి కంటే ఓ కాస్తంత ఎక్కవ నిడివి ఆయనది. అదనంగా హీరోయిన్ తో ఓ డ్యూయెట్ పాడారు. చివర్లో ఓ పది పదిహేను నిమిషాలు మాత్రమే నటనకు స్కోప్ చిక్కింది. నాజర్ కు పోలీస్ ఆఫీసర్ తరహా పాత్రలు కొట్టినపిండే. చాలా సహజంగా ఆయన తన పాత్ర పోషించారు. పోలీసు పాత్రల్లో దుమ్ము దులిపే సురేష్ గోపి ఇందులో క్రిమినల్ లాయర్ గా పెద్దగా చేయగలిగేదీ కూడా ఏమీ లేదనిపిస్తుంది. అయితే ఉన్నంతలో తన పాత్రకు న్యాయం చేశారు. సలీం పాత్రధారి బాగా నటించాడు. ధర్మవరపు, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ తదితరుల కామెడీ ట్రాక్ వెరీ పూర్.
Be first to comment on this News / Article!
Pages: -1- -2- 3 -4-
|