'ఆ ఒక్కడు' రివ్యూ
సంగీత దర్శకుడు మణిశర్మ కార్డ్ కు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో ఆయన తగినతంగా ప్రేక్షకులను అలరించలేకపోతున్నారు. ఉన్నంతంలో 'రాధా మానస రాగ' పాట మెలోడీ పరంగా బాగుంది. 'అదేదోలే..' పాట కొద్దిగా రిలీఫ్. సురేంద్ర కృష్ణ సంభాషణలు సాదాసీదా మార్క్. కమలాకర్ ఛాయాగ్రహణం ఫరవాలేదు. వర్ ఎడిటింగ్ మరింత క్రిస్ప్ గా ఉండాల్సింది. టాలీ 2 హాలీ నిర్మాణ విలువలు ఓకే.
ప్రథమార్థం పట్టుగా లేకపోవడం, ద్వితాయార్థంలో హడావిడి మలుపులు ప్రేక్షకుల్లో తగిన క్యూరియాసిటీని కలిగించవు. చివరి 15 నిమిషాల్లో వచ్చే ట్విస్ట్, హీరో కొంచెం స్పీడ్ కావడం వంటివి కాస్తయినా కలిసొచ్చే అంశాలు. మధురిమ బీచ్ సాంగ్ పోస్టర్లు, అజయ్ హీరోగా ప్రమోట్ కావడం వంటివి ఇనీషియల్ కలెక్షన్లకు దోహడపడతాడు. ఓవరాల్ గా... 'ఆ ఒక్కడు' లాంగ్ రన్ నల్లేరు మీద నడక కానేరదు.
Be first to comment on this News / Article!
Pages: -1- -2- -3- 4
|