దేవా కట్టా 'ప్రస్థానం' మొదలు
దేవకట్టా తీసిన 'వెన్నెల' చిత్రంతోనే తనకు తొలి బ్రేక్ వచ్చిందని, ఇందులో తన క్యారెక్టర్ పూర్తి వైవిధ్యంగా ఉంటుందనీ శర్వానంద్ పేర్కొన్నారు. చక్కటి ఎమోషన్స్ తో ఉండే ఈ చిత్ర కథను రెండేళ్లు కష్టపడి దేవాకట్టా రెడీ చేశారని చెప్పారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ, 'స్నేహగీతం' తన తొలి చిత్రమనీ, మరో నెలలో ఆ సినిమా రిలీజ్ అవుతుందీ చెప్పారు. ఇప్పుడు 'ప్రస్థానం' చిత్రంలో దేవకట్టా ఓ ఛాలెంజింగ్ రోల్ ఇచ్చారని తెలిపారు. ఇందులో నాలుగు పాటలకు సాహిత్యం అందిస్తున్నట్టు గేయ రచయిత వనమాలి పేర్కొన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో 'వెన్నెల' కిషోర్, జీవా, ప్రవిత్రా లోకేష్, సురేఖావాణి, జయప్రకాష్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు. వల్లభనేని రోశయ్య సమర్పిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం దేవాకట్టా అందిస్తున్నారు. రాజీవ్ నాయర్ కళాదర్శకత్వం-ప్రొడక్షన్ డిజైన్, సవితా సింగ్ సినిమాటోగ్రఫీ, మహేష్ శంకర్ సంగీతం సమకూరుస్తున్నారు.

Be first to comment on this News / Article!
Pages: -1- 2
|