జూలై 31న 'ఫిల్మ్ ఫేర్'
హైదరాబాద్ : ప్రతిష్ఠాత్మక 56వ ఐడియా ఫిల్మ్ ఫేర్ అవార్డులు-2008 కు హైద్రాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. దక్షిణాది భాషా చిత్రాలకు సంబంధించి ఉత్తమ చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఈ అవార్డుల ప్రదానం జరుగుతుంది. టైమ్స్ గ్రూప్ నకు చెందిన వరల్డ్ వైడ్ మీడియా లిమిటెడ్, ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీకి చెందిన ఐడియా సెల్యూలార్ తో కలిసి ఈ అవార్డుల సెర్మనీ నిర్వహించనుంది. జూలై 31న హైద్రాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో (హెచ్ ఐసిసి) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. హైద్రాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో సోమమవారం జరిపిన పాత్రికేయుల సమావేశంలో వరల్డ్ వైడ్ మీడియో ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తరుణ్ రాయ్, ఐడియా సెల్యూలార్ లిమిటెడ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ప్రదీప్ శ్రీవాత్సవ పాల్గొని ఆ వివరాలను తెలియజేశారు. ప్రముఖ సినీ నటి ఇలియానా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
తొలుత ఇలియానా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించింది. అనంతరం తరుణ్ రాయ్ మాట్లాడుతూ, దక్షిణాది సినిమా మార్కెట్, ప్రతిభను చాలాకాలం క్రితమే ఫిల్మ్ ఫేర్ గుర్తించిందనీ, ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు 54 ఏళ్లుగా తాము సెపరేట్ ఫిల్మ్ ఫేర్ అవార్డు ఫంక్షన్లు నిర్వహిస్తూ వస్తున్నామనీ చెప్పారు. దక్షిణాది సినీ పరిశ్రమతో ఐదు దశాబ్దాల అనుబంధం కలిగి ఉన్నందుకు తామెంతో గర్విస్తున్నామని అన్నారు. ఈసారి ఐడియా అసోసియేషన్ తమకెంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నామనీ చెప్పారు. హైద్రాబాద్ లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ వేడుక జరపనున్నామనీ తెలిపారు. రెండేళ్ల క్రితం ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న ఇలియానా ఈ కార్యమానికి హాజరుకావడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|