'మగధీర' ఆడియో రిలీజ్
రామ్ చరణ్, కాజల్ జంటగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన 'మగధీర' చిత్రం ఆడియో వేడుక ఆదివారం రాత్రి శిల్పకళా వేదికపై కన్నుల పండువగా జరిగింది. ప్రజారాజ్యం పార్టీ అధినేత మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆడియో క్యాసెట్ ను చిరంజీవి ఆవిష్కరించి సి.అశ్వనీదత్, కె.రాఘువేంద్రరావు, డి.రామానాయుడు తదితరులకు అందజేశారు. ఆడియో సీడీని పవన్ కల్యాణ్ ఆవిష్కరించి శ్రీహరి, అల్లు అర్జున్, శ్రీకాంత్, రవితేజలకు అందజేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది. నాగబాబు, అల్లు అరవింద్, బివిఎస్ఎన్ ప్రసాద్, దిల్ రాజు, డివివి దానయ్య, సి.కల్యాణ్, శ్రీనువైట్ల, ఎల్ కుమార్ చౌదరి, మురుగదాస్, సురేందర్ రెడ్డి, మెహర్ రమేష్, క్రిష్, చంద్రబోస్, సునీల్, ఆలీ, శివారెడ్డి, రాజమౌళి, ఎం.ఎం.కీరవాణి, రమా రాజమౌళి, శాంతి శ్రీహరి, పరుచూరి వెంకటేశ్వరరావు, చిన్నికృష్ణ, దేవీ వర ప్రసాద్, రామ్ చరణ్, కాజల్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
రాజమౌళి మాట్లాడుతూ, ఈ చిత్రంలో చిరంజీవి ఒక చిన్న సీన్ లో నటించారనీ, అయితే ఆయన మరిన్ని సినిమాలు చేయాలని తాను కోరుకుంటున్నాననీ అన్నారు. ఈ చిత్ర నిర్మాణ సమయంలో అల్లు అరవింద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత భోగవల్ల ప్రసాద్ ఒక్కసారిగా సెట్స్ కు రాలేదనీ, తనపై వారికున్న కాన్ఫిడెన్స్ కు ఇది నిదర్శమని అన్నారు. ఈ సినిమాని తీర్చిదిద్దడంలో జరిగిన జాప్యం రామ్ చరణ్ కు కొద్దిపాటి మనస్థానం కలిగి ఉండొచ్చనీ, అయితే ట్రైలర్స్ చూసి తప్పనిసరిగా సంతృప్తి చెందుతాడని చెప్పగలననీ అన్నారు. తెలుగులో ఇంత భారీ చిత్రం ఇంతవరకూ రూపొందలేదనీ, ఈ చిత్రానికి కీరవాణి అద్భుతమైన సంగీతం ఇవ్వడంతో పాటు రెండు పాటలు కూడా రాశాననీ చెప్పారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, చరణ్ ఐదేళ్ల ప్రాయం నుండే గుర్రపుస్వారీలో శిక్షణ పొందుతూ వచ్చాడనీ, అన్నయ్య పేరు ప్రతిష్ఠతలను పదింతలు పెంచే స్థాయి చరణ్ లో ఉందనీ అన్నారు. ఈ చిత్రం మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు పలు రికార్డులు సృష్టిస్తుందని అన్నారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|