'కరెంట్' ట్రిపుల్ ప్లాటినం
సుశాంత్ తల్లి, నిర్మాతల్లో ఒకరైన నాగసుశీల మాట్లాడుతూ, నాన్నగారి (అక్కినేని నాగేశ్వరరావు) జన్మస్థలం కృష్ణాజిల్లా అనీ, ఈ చిత్రం ఆడియో వేడుక విజయవాడలో జరగడం సంతోషంగా ఉందనీ పేర్కొన్నారు. తాను చిన్నప్పటి నుంచి నటుల కుటుంబంలో పెరిగాననీ, తమ్ముడు నాగార్జునతో ఆటలాడుకుండా పెరిగి నాగార్జునలో నటుడిని చూశాననీ, ఇప్పుడు సుశాంత్ ను నటుడుగా చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందనీ అన్నారు. కరెంట్ చిత్రాన్ని మరింత పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, ప్రసాద్ ఆర్ట్స్ పిక్చర్స్ బ్యానర్ లో చిత్రాలు నిర్మించి ఇప్పుడు శ్రీనాగ్ కార్పొరేషన్ లో బ్యానర్ లో చిత్రాల్ని నిర్మిస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. మరో నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, దర్శకుడు చెప్పిన స్టోరీలైన్ విన్నప్పుడే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందనుకున్నాననీ, అలాగే ఆయన స్క్రీన్ పై ఈ చిత్రాన్ని చక్కగా మలిచారనీ అన్నారు. అన్ని ఏరియాల్లోనూ ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో ముందుకు వెళ్తోందన్నారు. దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రాన్ని మ్యూజికల్ హిట్ గా నిలిపారని అన్నారు. మూడేళ్ల క్రితం సుశాంత్ ను చూసినప్పుడు సరైన సబ్జెక్ట్, టెక్నీయన్లు కుదిరితే పెద్ద ఆర్టిస్టు అవుతాడని తాను ఊహించాననీ, ఇప్పుడు సుశాంత్ తనను తాను ప్రూవ్ చేసుకున్నారనీ అభినందించారు.
ఈనాటి బంధం ఏనాటిదో...
అక్కినేని కుటుంబంతో తనకెంతో సాన్నిహిత్యం ఉందని ప్రత్యేక అతిథిగా విచ్చేసిన తుర్లపాటి కుటుంబరావు పేర్కొన్నారు. 1957లో అక్కినేని నాగేశ్వరరావుకు 'నటసామ్రాట్' బిరుదును ప్రదానం చేసింది విజయనగరమేననీ, అప్పుడు ఆ బిరుదును ప్రతిపాదించినది తానేననీ ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ బిరుదును ప్రదానం చేసి 50 ఏళ్లు అయిన సందర్భంగా 2007లో నాగేశ్వరరావు తనను స్వయంగా హైద్రాబాద్ ఆహ్వానించి సన్మానించారనీ, అలాగే విజయవాడలో నాగేశ్వరావు, నాగార్జునల ఫంక్షన్ ఏది జరిగినా తాను అధ్యక్షుడిగా వ్యవహరించే వాడిననీ అన్నారు. అక్కినేని మూడో తరానికి చందిన అఖిల్ 'సిసింద్రీ' ఫంక్షన్ కు, సుమంత్, సుశాంత్ ల ఫంక్షన్ కు తానే అధ్యక్షుడిగా వ్యవహించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. సుశాంత్ నటుడిగా పరిణతి చెందాడనీ, డాన్స్ లలో చెలరేగాడనీ ప్రశంసించారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- 2 -3-
|