'గోపి గోపిక గోదావరి' రివ్యూ
దర్శకుడు వంశీ తన ట్రైడ్ మార్క్ అంశాలైన హ్యూమర్, సాహిత్యం, సంగీతంపై ఎక్కువ దృష్టి సారించినట్టుగా స్టోరైలైన్ పై ఫోకస్ చేయలేదని అనిపిస్తుంది. నిజానికి కథకు కీలకమైన వ్యక్తులు యాక్సిడెంట్ లో జ్ఞాపకశక్తి కోల్పోయి మళ్లీ అలాంటి సంఘటననే జరిగినప్పుడు మామూలు మనిషి కావడం అనేది ఎప్పటి పాయింట్? అసలు హీరోని కొట్టిన వ్యక్తులు దొంగలా? ఎవరైనా పంపగా వచ్చారా? అనేది దర్శకుడు చివర్లో కూడా చెప్పనేలేదు. అతను (హీరో) రాడు...అనే మాట హీరోయిన్ తల్లితో చెప్పించడం ద్వారా
ఆమె ఈ కుట్రకు పాల్పడి ఉండవచ్చనే అపోహ మాత్రం కలిగించారు.
వేణుకు ఈ తరహా పాత్రలు కొట్టినపిండే. షరామామూలుగానే తన పాత్రలో ఇమిడిపోయారు. కమలిని ముఖర్జీ నటనపరంగా ఆకట్టుకుంటున్నా 'లుక్స్' విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన తరుణం వచ్చిందనిపిస్తుంది. 'గోదావరి' చిత్రంలో 'అందంగా లేనా...అసలేం బాలేనే' అంటూ చీరలోనే ఎబ్బెట్టులేని అందాలతో అలరించిన కమలిని ఇప్పుడు వంశీ హీరోయిన్ అయి ఉండికూడా కనీసం ఆ స్థాయిలో కూడా ఇందులో కనిపించకపోవడం ఆశ్చర్యమే. డాక్టర్ గోపిక (కమలిని) అసిస్టెంట్ లుగా నటించిన
ఆర్టిస్టుల నుంచి కామెడీ బాగా పండింది. కృష్ణభగవాన్-సన-కొండలవలస మధ్య వచ్చే కామెడీ ట్రాక్ కూడా (కొంచెం ముతగ్గా ఉన్నా) సగటు ప్రేక్షకుడు ఎంజాయ్ చేయవచ్చు. హీరో తల్లిగా గీతాంజలి, హీరోయిన్ తల్లిగా జయలలిత, డాక్టర్ శ్యామ్ గా కల్యాణ్ తన పాత్రలను సమర్ధవంతగానే రక్తి కట్టించారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- 2 -3-
|