'గోపి గోపిక గోదావరి' రివ్యూ
సాంకేతికపరంగా చక్రి మ్యూజిక్ కు అగ్రతాంబూలం దక్కుతుంది. ఇప్పుడే చక్రి అందించిన సాంగ్స్ రింగ్ టోన్స్ గా, ఇతర రూపాల్లో
రఫ్ఫాడిస్తున్నాయి. ముఖ్యంగా 'నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా' పాట మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉండి థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మంచి రెస్సాన్స్ రాబట్టుకుంటోంది. 'కనివిని ఎరుగని పరణయమిది' అనే పాట కూడా ఈ కోవలేనిదే. రామజోగయ్య శాస్త్రి సాహిత్య గుభాళింపులు వెదజల్లారు. లోకి పి.గౌడ్ సినిమాటోగ్రఫీ ఫరవాలేదు. పడాల శివ సుబ్రమణ్యం సంభాషణలు కామెడీ ట్రాక్ లో బాగా పేలాయి. అయితే సెంటిమెంట్, సీరియస్ సన్నివేశాల్లో సంభాషణల్లో తగినంత బలం కనిపించదు. బస్వా పైడిరెడ్డి ఎడిటింగ్, వల్లూరి పల్లి రమేష్ నిర్మాణ విలువలు తగినట్టుగానే ఉన్నాయి.
సినిమా ఎత్తుగడ వంశీ మార్క్ ఎంటర్ టైన్ మెంట్ తో మొదలైనా విశ్రాంతి కార్డ్ దగ్గరకు వచ్చే సరికి వేగం తగ్గిపోయింది. ద్వితీయార్థం దానికి కొనసాగింపుగానే నడక సాగించింది. కాకుంటే హీరోహీరోయిన్లను కలుపుతారా లేదా అనే క్యూరియాసిటీని చివరి వరకూ దర్శకుడు మెయింటెన్ చేశారు. సంగీతం, సాహిత్యం, వంశీకి ఉన్న పేరు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు అయితే, స్టోరీలైన్, ద్వితీయార్థం ఆశించినంత గ్రిప్పింగ్ గా నడకసాగించకపోవడం నిరాశపరచే అంశాలు. వంశీ ఇటీవల చిత్రాలతో పోలిస్తే 'గోపి గోపిక గోదావరి' బ్రేక్ ఇచ్చే చిత్రం కాకపోవచ్చు కానీ...యావరేజ్ అనిపించుకునే అవకాశాలు ఉన్నాయి. మ్యూజిక్ సైడ్ నుంచి నరుక్కుని వెళితే ఫిల్మ్ మేకర్స్ కు ఆశించిన ఫలితం దక్కచ్చు...

Read 1 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- -2- 3
|