దీపిక సాంగ్ తో 'లవ్ 4 ఎవర్'
'చక్ దే మాహియా
నీదే దునియా
హద్దు దాటి ఆడేయ్ డే అండ్ నైట్
లవ్వంటే మాయ లైఫే ఓ మాయ
నచ్చినట్టు చేసేయ్ రాంగ్ ఆర్ రైట్...'
అంటూ సాగే ఓ పాటను బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనేపై అహ్మద్ ఖాన్ నృత్య దర్శకత్వంలో 'లవ్ 4 ఎవర్' చిత్రం కోసం దర్శకనిర్మాత జయంత్ సి.పరాన్జీ తాజాగా చిత్రీకరించారు. ఆ విశేషాలను దీపిక, జయంత్ తెలియజేశారు.
దీపిక పడుకునే మాట్లాడుతూ, దక్షిణాది నుంచి చాలా ఆఫర్లే వచ్చినా హిందీలో బిజీగా ఉండటం వల్ల అంగీకరించలేదనీ, జయంత్ గారు తన ఫ్రెండ్ కావడం వలన క్యాజువల్ గా ఆయన సబ్జెక్ట్ చెప్పి ఇందులో స్పెషల్ సాంగ్ చేయాలని అనుగానే చాలా ఇన్ స్పైర్ అయిన నటించాననీ చెప్పారు. ఈ కథలో తన సాంగ్ కు చాలా ప్రాధాన్యం ఉందనీ, జయంత్ తో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉందనీ చెప్పారు. కథ విని అడగ్గానే స్పెషల్ సాంగ్ చేసేందుకు దీపిక అంగీకరించడం హ్యాపీగా ఉందని జయంత్ పేర్కొన్నారు. బాలీవుడ్ లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కథ మీద ఆసక్తి కొద్దీ ఈ సాంగ్ చేయడానికి దీపిక అంగీకరించిందనీ, షూటింగ్ 7.30 గంటలకు అంటే ఓ ఐదు నిమిషాల ముందే మేకప్ తో లొకేషన్ లో ఉండేదనీ, అంతటి సిన్సియర్ ఆర్టిస్ట్ దీపిక అనీ కితాబిచ్చారు. దీపికతో ఓ సినిమా చేయాలనిపించి ఓ కథ కూడా చెప్పాననీ, ఓ తమిళ అమ్మాయి న్యూయార్క్ లో ఉన్న ఓ అబ్బాయిని ప్రేమిస్తుందనీ, దీపిక కూడా తన క్యారెక్టర్ విని తప్పకుండా చేస్తానని చెప్పిందనీ వివరించారు. ఇందులో రణ్ బీర్ హీరోగా అనుకుంటున్నట్టు చెప్పారు. ఆ వివరాలు మరోసారి తెలియజేస్తానని అన్నారు. 'లవ్ 4 ఎవర్ 'లో దీపిక సాంగ్ హైలైట్ అవుతుందన్నారు. ఈ పాటను 4 కెమెరాలతో షూట్ చేశామనీ, ఓ కెమెరాతో టోటల్ సాంగ్ దీపిక క్లోజప్స్ తో తీశామనీ, సినిమాలో కథ ప్రకారం డాన్స్ మూమెంట్స్ ఉన్న సాంగ్ ను ఉంచుతామనీ, సినిమా ఫినిష్ అయ్యాక వచ్చే ఎండ్ టైటిల్స్ లో దీపికను క్లోజప్స్ తో షూట్ చేసిన సాంగ్ ఉంటుందనీ చెప్పారు. రెండుసార్లు ఈ పాట చూసిన ప్రేక్షకులు మళ్లీ మళ్లీ ఈ పాట కోసమే థియేటర్లకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|