'బిల్లా' 100 రోజుల వేడుక
ప్రభాస్, కృష్ణంరాజు, అనుష్క, నమిత ప్రధాన పాత్రధారులుగా మెహర్ రమేష్ దర్శకత్వంలో గోపీకృష్ణ మూవీస్ పతాకంపై కృష్ణంరాజు సమర్పించిన 'బిల్లా' చిత్రం 13 కేంద్రాల్లో ఇటీవల శతదినోత్సవం జరుపుకొంది. నరేంద్ర, ప్రభోద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం శతదినోత్సవాన్ని హైద్రాబాద్ లోని హోటల్ మారియట్ లో కుటుంబ వేడుకలా నిర్వహించారు. కృష్ణంరాజు, కె.రాఘవేంద్రరావు, డాక్టర్ మోహన్ బాబు, సుమన్, ఎన్టీఆర్, మంచు విష్ణు, కోడి రామకృష్ణ, జయంత్, రాజమౌళి, దిల్ రాజు, పరుచూరి వెంకటేశ్వరరావు, ఆలీ, ప్రభాస్, అనుష్క, హన్సిక, మెహర్ రమేష్, ప్రబోధ్, నరేంద్ర, శ్రీమతి శ్యామలాదేవి, సుబ్బరాజు, ప్రీతమ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు మోహన్ బాబు, కృష్ణంరాజు, ప్రభాస్, అనుష్క, మెహర్ రమేష్ చేతుల మీదుగా 100 రోజుల షీల్డ్ ల ప్రదానం జరిగింది. కృష్ణంరాజు స్టేట్ అసోసయేషన్ ప్రెసిడెంట్ జొన్నలగడ్డ శ్రీరామచంద్రమూర్తి ప్రత్యేకంగా తయారుచేసిన నూరురోజుల షీల్టులను కృష్ణంరాజు, ప్రభాస్ లకు అందజేశారు.
కృష్ణంరాజు మాట్లాడుతూ, గోపీకృష్ణ మూవీస్ సంస్థ నుంచి వచ్చిన చిత్రాలన్నీ మంచి హిట్టయ్యాయననీ, సుమారు 20 ఏళ్ల గ్యాప్ తర్వాత 'బిల్లా' నిర్మిస్తే ప్రజలు ఇంత గొప్పగా ఆదరించడం చాలా ఆనందం కలిగిస్తోందనీ అన్నారు. హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రాన్ని తీశారని అందరూ ప్రశంసించారనీ, ప్రతి ఒక్క ఆర్టిస్టు, టెక్నీషియన్ తమ సొంత చిత్రంలా భావించి కష్టపడ్డారనీ, వారందరికీ తన అభిందనలనీ అన్నారు. ఈ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులు, అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకొంటున్నామని పేర్కొన్నారు. మెహర్ రమేష్ మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని ఇంతగా ఆదిరించిన ప్రేక్షకులు, అభిమానులందరికీ తన కృతజ్ఞతలని అన్నారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|