'ఫిల్మ్ ఫేర్' బరిలో ఎవరెవరు?
ప్రతిష్ఠాత్మక 56వ 'ఐడియా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్-2008'కు రంగం సిద్ధమవుతోంది. దక్షిణాది సినీ పరిశ్రమకు ఏటా ఇచ్చే ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రదానోత్సవానికి ఈసారి హైద్రాబాద్ వేదిక కానుంది. ఈనెల 31న హైద్రాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో అత్యంత వైభవంగా ఈ అవార్డుల వేడుక జరుగనుంది. తెలుగు సినిమాలకు సంబంధించి ఉత్తమ చిత్రం కేటగిరిలో 6 సినిమాలు పోటీపడుతున్నాయి. ఉత్తమ నటుడి అవార్డుకు ఐదుగురు హీరోలు, ఉత్తమ నటి అవార్డుకు ఐదుగురు హీరోయిన్లు పోటీపడుతున్నారు. నామినేషన్ జాబితా వివరాల్లోకి వెళితే...
ఉత్తమ చిత్రం కేటగిరిలో 'అష్టాచమ్మ', 'గమ్యం', 'జల్సా', 'కొత్త బంగారులోకం', 'పరుగు', 'రెడీ' చిత్రాలు పోటీపడుతున్నాయి. ఉత్తమ దర్శకుడి కేటగిరిలో భాస్కర్ (పరుగు), జాగర్లమూడి రాధాకృష్ణ (గమ్యం), రవిబాబు (నచ్చావులే), శ్రీనువైట్ల (రెడీ), త్రివిక్రమ్ శ్రీనివాస్ (జల్సా), వి.వి.వినాయక్ (కృష్ణ) బరిలో ఉన్నారు. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పరుగు), ఎన్టీఆర్ (కంత్రి), పవన్ కల్యాణ్ (జల్సా), రామ్ (రెడీ), రవితేజ (కృష్ణ) తలపడుతున్నారు. ఉత్తమ నటి కోసం స్వాతి (అష్టా చమ్మ), ఇలియానా (జల్సా), కమలిని ముఖర్జీ (గమ్యం), శ్వేతబసు ప్రసాద్ (కొత్త బంగారులోకం), త్రిష (కృష్ణ) పోటీపడుతున్నారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|