'ఆంజనేయులు' రివ్యూ
పరశురామ్ రాసుకున్న కథ పాత ఫార్ములానే. అయితే కథనం ద్వారా ఆయన సినిమాను పరుగులు తీయించారు. సీన్ బై సీన్ చేసుకుంటూ వెళ్లడం, ఎక్కడా ప్రేక్షకుల మెదళ్లకు పనిపెట్టకుండా సాఫీగా కథను నడపడం, ఎవరూ ఊహించని చోట ట్విస్ట్ ఇవ్వడం ద్వారా సినిమాపై పట్టు బిగించారు. ముఖ్యంగా యంగ్ జనరేషన్ ఆడియెన్స్ ఎలాంటి సంభాషణలు ఆశిస్తారో అవపోశాన పట్టి ఆయన కలం పట్టినట్టు అనిపిస్తుంది. 'ఏరా...పోరా...ఒరేయ్' అంటూ హీరో-హీరోయిన్లు పిలుచుకోవడం, తిట్లదండకం సాగించడం ఇటీవల సినిమాల్లో పరిపాటైంది. ఇందులో హీరో మాత్రమే అడ్వాంటేజ్ తీసుకుని హీరోయిన్ ను విట్టీ కోసం అన్నట్టుగా చేసే సంబోధనలు (వెధవా..వెదవ కానా.. అనే ప్రయోగం ఒకటి) యూత్ ను అలరించే ప్రయత్నంలో భాగంగానే చెప్పుకోవచ్చు. అయితే ఆలయంలో హీరోయిన్ తో హీరో తో హనీమూన్ ముచ్చట్లు పెట్టి....గట్టి మంచం కొందాం..చితగ్గొట్టేదాం వంటి పదప్రయోగాలు చేయడం ఎంతమాత్రం సమర్ధనీయం కాదు. మంచి టైటిల్ పెట్టి 'మైలు' పరచడం అంటే ఇదే.
'కిక్' తెచ్చిన సక్సెస్ తో రవితేజలో ఎనర్జీ పాళ్లు ఇందులో మరింత ఎక్కువగా కనిపిస్తాయి. హ్యూమర్, యాక్షన్ తో పాటు సెంటిమెంట్ కూడా చక్కగా పండించారు. రొమాంటిక్ సందర్భాల్లోనూ మమేకం అయి నటించారు. ఆయన గత సినిమాలతో పోలిస్తే రవితేజ ఇందులో గ్లామర్ కూడా మెయింటెన్ చేయడం కనిపిస్తుంది. నయనతార పాత్ర నిడివి బాగానే ఉన్నా నటనకు ఉన్న స్కోప్ తక్కువ. గ్లామర్ మెరుపులు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. ప్రధానంగా కొన్నిచోట్ల హెయిర్ స్టయిల్, కనురెప్పలకు వేసిన కలర్స్ ఎబ్బెట్టుగా ఉన్నాయి. బడాగా విలన్ పాత్రలో సోనూసూద్ ఓకే. 'లోక్ సత్తా' అధినేత జయప్రకాష్ నారాయణ్ తరహా పాత్రలో ప్రకాష్ రాజ్ గెస్ట్ రోల్ పోషించారు. వృత్తిపట్ల నిబద్ధత ఉన్న జర్నలిస్టుగా బ్రహ్మాజీ, హీరో తల్లిడండ్రులుగా నాజర్, సన తమ పాత్రలకు న్యాయం చేశారు. విలన్ అసిస్టెంట్లుగా రాజా రవీంద్ర, టార్జాన్ లు కొద్దిపాటి కామెడీ కూడా పండించారు. ఎచ్ఎంటీవీ క్రియేటివ్ హెడ్ గా బ్రహ్మానందం మరోసారి నవ్వుల విందు చేశారు. ఎమ్మెస్ నారాయణ గెస్ట్ రోల్ కూడా బాగా పండింది. జీవా, శ్రీనివాస రెడ్డి తదితరుల తమ పాత్రలను తగినవిధంగా పోషించారు. కిమ్ శర్మ ఐటెం సాంగ్ ఎలాంటి కిక్ ఇవ్వదు.
Read 4 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- 2 -3-
|