'ఆంజనేయులు' రివ్యూ
సాంకేతికపరంగా ఎస్.థమన్ సంగీతం యూత్ ఫుల్ గా ఉంది. ముఖ్యంగా 'అంజలీ...అంజలీ', 'ఈ ఇంటి అల్లుడ్ని నేనే కదా...బోల్ రాధా' పాటలు యూత్ ను మునివేళ్ల మీద స్టెప్స్ వేయిస్తాయి. బ్రాక్ గ్రాండ్ మ్యూజిక్ కూడా ఫరవాలేదు. పరశురామ్ సంభాషణలు సినిమాకి అదనపు ఎస్సెట్. కాకుంటే పూరీ జగన్నాథ్ తరహా సంభాషణలకు దగ్గరగా ఉన్నాయి. రవీంద్రబాబు సినిమాటోగ్రఫీ పనితనం స్పష్టంగా కనిపిస్తుంది. మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ క్రిస్ప్ గా ఉంది. నిర్మాణ విలువల విషయంలోనూ గణేష్ మంచి ప్రమాణాలు పాటించారు.
సినిమా ప్రథమార్థం వినోదం, యాక్షన్, రొమాంటిక్ అంశాలతో సాఫీగా నడిస్తే, ద్వితీయార్థంలో సెంటిమెంట్, సరైన ప్లేస్ లో పాటలు పడకపోవడం వంటివి కొద్దిపాటి వేగాన్ని తగ్గించినా హెవీ క్లైమాక్స్...రెండేళ్ల తర్వాత అంటూ రవితేజ-నయనతారకు బుల్లి కృష్ణమూర్తి (తండ్రిపేరే పిల్లాడికి పెడతారు) పుట్టినట్టు చూపించి ఫైనల్ కార్డ్స్ వేయడం అలరిస్తుంది. ఓవరాల్ గా...'కిక్' తర్వాత 'ఆంజనేయులు' రవితేజకు కరెక్ట్ స్టెప్ గా చెప్పొచ్చు. కొత్త దర్శకులకు తరచు ఎదురయ్యే ద్వితీయ విఘ్నాన్ని సక్సెస్ ఫుల్ గా పరశురామ్ అధిగిమించి స్టార్ డైరెక్టర్ గా ప్రమోట్ అయినట్టే. యాక్షన్, కామెడీ చిత్రాల ఇష్టపడే ప్రేక్షకులకు 'ఆంజనేయులు' మంచి ట్రీట్ ఇవ్వడం ఖాయం...
Read 4 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- -2- 3
|