'సంతోషం' సైడ్ లైట్స్...
హైద్రాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ లో శుక్రవారం కన్నులపండువగా జరిగిన 'సంతోషం సినీ అవార్డులు-2008' ప్రదానోత్సవంలో పలు హైలైట్స్ చోటుచేసుకున్నాయి.
-కృష్ణుడు పేరుతో ఉన్న ముగ్గురు ఒకే వేదికపై అవార్డులు తీసుకుని ఒకరినొకరు సన్మానించుకోవడం విశేషం. వీరు బాలకృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ, బాలనటిగా 'పాండురంగ మహాత్మ్యం'లో కృష్ణుడు పాత్ర పోషించిన శ్రీమతి విజయనిర్మల. బాలకృష్ణ ఉత్తమ హీరో అవార్డును కృష్ణ చేతులమీదుగా అందుకోగా, కృష్ణ-విజయనిర్మల దంపతులకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డులను బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవితో కలిసి అందజేశారు. అజాత శత్రువుగా పేరున్న కృష్ణ మధ్యన నిలబడి చిరంజీవి, బాలకృష్ణ భుజాలపై చెరో చేయి వేయడంతో అభిమానుల్లో సంబరం మిన్నంటింది.
-కృష్ణకు లైఫ్ టైమ్ ప్రదానం చేసే సమయంలో స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం ద్వారా తెలుగు వారి సంప్రదాయం ఎంత గొప్పదో మరోసారి ప్రేక్షకాభిమానులు చాటుకున్నారు.
-వేదికపై 'మగధీర' ప్రస్తావన వచ్చినప్పడు, ఆ చిత్ర దర్శకుడు రాజమౌళిపై కెమెరా పడి స్క్రీన్ పై కనిపించినప్పుడు ఆడియెన్స్ ఈలలు, కేకలతో హోరెత్తించారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|