రజతోత్సవ నటుడు నాగ్
ఏ నటుడికైనా ప్రేక్షకుల రివార్డులకు మించిన అవార్డులు లేకపోయినా ఆయన అందుకున్న అవార్డులు కూడా చాలానే ఉన్నాయి. కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున నటించిన 'నిన్నే పెళ్లాడతా' చిత్రం బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా జాతీయ అవార్డు గెలుచుకుంది. అలాగే 1998లో 'అన్నమయ్య' చిత్రానికి స్పెషల్ జ్యూరీ కింద జాతీయ అవార్డు లభించింది. 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' చిత్రాలకు ఉత్తమ నటుడుగా రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డులు అందుకున్నారు. 'ప్రేమకథ' చిత్రాన్ని నిర్మించినందుకు కాంస్య నంది, 'మన్మథుడు' చిత్ర నిర్మాతగా స్వర్ణ నంది అందుకున్నారు. 'సంతోషం' ఉత్తమ నటుడు అవార్డును 2002లో అందుకున్నారు. 'శివ' (1990), 'అన్నమయ్య' (1997) చిత్రాలకు గాను ఉత్తమ నటుడుగా ఫిల్మ్ ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు.
తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు లివింగ్ లెజెండ్ అనీ, ఆయన అంత స్థాయికి తాను ఎదుగలేకపోయినా నాగచైతన్య తన తాతను మించి ఎదగాలని కోరుకుంటున్నాననీ నాగార్జున చెప్పడం వెనుక భేషజాలు లేని ఆయన మనస్తత్వాన్ని, కుమారుని పట్ల తనకున్న బాధ్యతను చాటిచెబుతుంది. ఏనాడూ టెన్షన్ పడకపోవడం, కూల్ గా ఉండటం, సరైన ఆహారపు అలవాట్లు, శరీర మార్పుల పట్ల ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం వంటివి నాగార్జున గ్లామర్ రహస్యాలుగా చెప్పాలి. నాగచైతన్య తొలి సినిమా 'జోష్' విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న నాగార్జున తిరిగి తనకు అత్యంత ఆత్మీయుడైన కామాక్షి మూవీస్ అధినేత డి.శివప్రసాద్ రెడ్డి చిత్రం సెట్స్ పైన అడుగుపెడుతున్నారు. తన సహజ శైలిలోనే ఈ చిత్రం ద్వారా కిరణ్ అనే కొత్త యువకుడిని దర్శకుడిగా ప్రోత్సహిస్తున్నారు. నటుడుగా, వ్యాపారవేత్తగా విజయాలు సాధిస్తూ అప్రతిహతంగా ముందుకు దూసుకు వెళ్తున్న రజతోత్సవ నటుడుకు జన్మదిన శుభాక్షాంక్షలు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|