'ఈనాడు'లోగో ఆవిష్కరణ
కమల్ హాసన్, విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన 'ఉన్నైపోల్ ఒరువన్' చిత్రం తెలుగులో 'ఈనాడు' పేరుతో ఏకకాలంలో విడుదలకు సిద్ధమవుతోంది. జి.కుమార్ బాబు 'ఈనాడు' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. చక్రి తోలేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం లోగో ఆవిష్కరణ కార్యక్రమం హైద్రాబాద్ లోని తాబ్ బంజారాలో సందడిగా జరిగింది. దర్శకరత్న డాస్టర్ దాసరి నారాయణరావు, డాక్టర్ డి.రామానాయుడు, కమల్ హాసన్, వెంకటేష్, చక్రి తోలేటి, పరుచూరి వెంకటేశ్వరరావు, నీలకఠం, శ్రీనువైట్ల, దగ్గుబాటి రాణా తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. దాసరి నారాయణరావు లోగో ఆవిష్కరించారు.
దాసరి నారాయణరావు మాట్లాడుతూ, ఫిల్మ్ మేకింగ్ ను ధైర్యంగా, సవాలుగా తీసుకున్న ఏకైక నటుడు కమల్ హాసన్ అనీ, దక్షిణాది సినీ పరిశ్రమలో ఎన్నో ప్రయోగాలు చేశారనీ ప్రశంసించారు. సహజంగా ఏ నటుడి విషయం తీసుకున్నా కెరీర్ లో గొప్పగా చెప్పుకునే సినిమాలు రెండుమూడు ఉంటాయనీ, కమల్ కెరీర్ లో 50కి పైగా బ్లాక్ బస్టర్లు ఉన్నాయనీ అన్నారు. తెలుగులో మల్టీస్టారర్ చిత్రాలు కనబడని తరుణంలో కమల్ హాసన్ తో పాటు విక్టరీ వెంకటేష్ ఈ చిత్రంలో నటించడం ద్వారా మరిన్ని మల్టీస్టారర్ చిత్రలకు మార్గం సుగమం అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కమల్ ను 'కన్యాకుమారి' చిత్రం ద్వారా అప్పట్లో తాను పరిచయం చేయాలని అనుకున్నట్టు తెలిపారు. కానీ బాలచందర్ గారు తెలుగులో కూడా కమల్ ను పరిచయం చేయాలని అనుకోవడం వల్ల తనకు సాధ్యపడలేదన్నారు. ఈ చిత్ర దర్శకుడు చక్రి తాను తీసిన 'భోలా శంకరుడు' చిత్రంలో బాలనటుడిగా నటించాడనీ, ఇప్పుడు దర్శకుడయ్యాడంటే నమ్మలేకుండా ఉన్నాననీ అన్నారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని తాను కోరుకుంటున్నానని పేర్కొన్నారు. డి.రామానాయుడు మట్లాడుతూ, కమల్ హాసన్ గురించి ఎంతైనా చెప్పుకోవచ్చనీ, వృత్తిపట్ల అంకింతభావం ఉన్న నటుడనీ ప్రశంసించారు. 'ఇంద్రుడు-చంద్రుడు' చిత్రం తనకు డబ్బుతో పాటు మంచి పేరు కూడా తెచ్చిపెట్టిందన్నారు. ఈ సినిమా కోసం కమల్ సంప్రదించినప్పుడు చిన్న వేషం అయినా తప్పనిసరిగా చేయాలని వెంకటేష్ బాబుకు చెప్పినట్టు పేర్కొన్నారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, అప్పట్లో తాము కృష్ణ హీరోగా 'ఈనాడు' సినిమాకు రచన చేశామనీ, నాటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తీసిన ఆ చిత్రం పెద్ద హిట్టయిందనీ అన్నారు. ఇప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన కమల్ 'ఈనాడు' కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|