'మహాత్మ' ట్రైలర్ రిలీజ్
శ్రీకాంత్ కథానాయకుడుగా నటిస్తున్న 100వ చిత్రం 'మహాత్మ'. కృష్ణవంశీ దర్శకత్వంలో గోల్డెన్ లైన్ ఫిలిమ్స్ బ్యానర్ పై సి.ఆర్.మనోహర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం థియేటర్ ట్రైలర్స్ ను సోమవారం సాయంత్ర ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో ఆవిష్కరించారు. శ్రీకాంత్, కృష్ణవంశీ, సి.ఆర్.మనోహర్, పరుచూరి సోదరులు తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
పరుచూరి వెంకటేశ్వరరావు తొలుత మాట్లాడుతూ, కృష్ణవంశీ ఈ స్టోరీలైన్ చెప్పినప్పుడు డాక్యుమెంటరీ అవుతుందేమోనని తాము భయపడ్డామనీ, కృష్ణవంశీతో కలిసి కథకు ఓరూపం ఇచ్చేసరికి చాలా బాగా వచ్చిందనీ చెప్పారు. వయలెంట్ గా ఉండే హీరో అహింస వైపు మారాడమే ఈ చిత్ర ఇతివృత్తమని అన్నారు. గతంలో తాము కృష్ణవంశీ సినిమాల్లో నటించినప్పటికీ ఆయన సినిమాకి స్క్రిప్టు రాయడం ఇదే ప్రథమమనీ, కె.రాఘవేంద్రరావు, బి.గోపాల్, కోదండరామిరెడ్డి తరహాలోనే కృష్ణవంశీ సైతం తమనుంచి ఏది కావాలో అది బాగా రాబట్టుకున్ారని అన్నారు. ఈ చిత్రం శ్రీకాంత్ కెరీర్ లో ఓ ల్యాండ్ మార్క్ అవుతుందనీ, ఆయన తొలి సినిమాకి స్క్రిప్టు రాసిన తమకు 100వ సినిమాకి కూడా రాసే అవకాశం వచ్చిందన్నారు. సినిమాలో మహాత్మా గాంధీకి చెందిన ఒక పెద్ద డైలాగ్ ఉందనీ, ఆ డైలాగ్ చాలా పాపులర్ అవుతుందనీ, సినిమా కూడా చాలా పెద్ద సక్సెస్ అవుతుందే నమ్మకం తనకుందనీ అన్నారు. ఈ చిత్రం రిలీజ్ కు ముందు వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికి చూపించాలని అనుకున్నామనీ, అయితే ఇంతలోనే దుర్ఘటన జరిగిందనీ పరుచూరి గోపాలకృష్ణ పేర్కొన్నారు. కృష్ణగారికి 'ఈనాడు', ఎన్టీఆర్ కు 'నాదేశం', చిరంజీవికి 'ఠాగూర్'లా శ్రీకాంత్ కు ఈ సినిమా నిలిచిపోతుందన్నారు. నిర్మాత మనోహర్ మాట్లాడుతూ, శ్రీకాంత్, కృష్ణవంశీ కాంబినేషన్ సినిమాకి నిర్మాత కావడం చాలా సంతోషంగా ఉందనీ, శ్రీకాంత్ 100వ చిత్రం విజయవంతంగా 100 రోజులు ఆడుతుందనే నమ్మకం తనకుందని అన్నారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|