'స్నేహానికి మరో పేరు వై.ఎస్'
డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని ప్రముఖ నటుడు డాక్టర్ ఎం.మోహన్ బాబు తెలిపారు. వైఎస్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదంలో చిక్కుకున్న విషయం ఈనెల 2న తాను స్విట్జర్లాండ్ లో 'సలీమ్' షూటింగ్ లో ఉండగా తెలిసిందనీ, వెంటనే వై.ఎస్.సోదరుడు, విష్ణు మామ అయిన సుధీకర్ రెడ్డికి ఫోన్ చేసి ప్రమాదం గురించి వాకబు చేశానని చెప్పారు.
'హైద్రాబాద్ రావడానికి ప్రయత్నించినప్పుడు 3వ తేదీ ఉదయం ఫ్లయిట్ టిక్కెట్ దొరికింది. అక్కడ్నించి దుబాయ్ చేరుకుని 4వ తేదీ ఉదయం హైద్రాబాద్ వచ్చాను. నేను, నాభార్య నిర్మల, విష్ణుబాబు, అతని భార్య విరానిక కలిసి హైద్రాబాద్ వచ్చాం. ఉదయం 9 గంటలకు కడపకు ప్రయాణమయ్యాం. నాతో పాటు లక్ష్మీప్రసన్న, సుధీకర్ రెడ్డి, కె.రాఘవేంద్రరావు తదిరులంతా 14 కార్లలో రోడ్డు ప్రయాణం చేసి సాంయంత్రం 4 గంటలకు వేంపల్లి చేరుకున్నాం. అక్కడ్నించి ముందు కెళ్లే పరిస్థితి లేకపోవడంతో మోటార్ సైకిళ్ల మీద వర్షంలో తడుస్తూ ఇడుపలపాయలో ఖననం చేస్తున్నప్రదేశానికి చేరుకున్నాం. అప్పటికే సమాధి మీద సగం వరకూ మట్టిపోస్తూ కనిపించింది' అని మోహన్ బాబు ఆవేదనతో చెప్పుకొచ్చారు. ప్రజల్లో, ముఖ్యంగా పేదవారు, మహిళల్లో వై.ఎస్.చెరగని ముద్ర వేసుకున్నారనీ, ఆయన మన మధ్య లేరనే విషయం జీర్ణించుకోలేకపోతున్నాననీ అన్నారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|