'గణేష్' పాటలు రిలీజ్
రామ్, కాజల్ జంటగా శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్న చిత్రం 'గణేష్' (జస్ట్ గణేష్). శరవణన్ దర్శకుడు. మిక్కీ జె.మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం రామానాయుడు స్టూడియోస్ లో గురువారం రాత్రి జరిగింది. ఈ వేడుకలో ఎన్టీఆర్, డి.సురేష్ బాబు, బి.గోపాల్, దిల్ రాజు, కోటి తో పాటు చిత్ర యూనిట్ పాల్గొంది. ఎన్టీఆర్ ఆడియో క్యాసెట్ ను ఆవిష్కరించి తొలి ప్రతిని కోటికి అందజేశారు. డి.సురేష్ బాబు ఆడియో సీడీని ఆవిష్కరించి దిల్ రాజుకు అందజేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.
కోటి మాట్లాడుతూ, తన మిత్రుడు రవికిషోర్ మంచి కథతో ఈ చిత్రాన్ని తీశాడనీ, మిక్కీ జె.మేయర్ చక్కటి సంగీతం అందించారనీ అన్నారు. ఇదే సంస్థలో వచ్చిన 'రెడీ' తరహాలోనే ఈ చిత్రం కూడా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నానని అన్నారు. రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ, స్రవంతి రవికిషోర్ తీసిన 'యువసేన' రచయితగా తనకు తొలి చిత్రమనీ, ఈ చిత్రంలో ఐదు పాటలకు తానే సాహిత్యం అందించాననీ చెప్పారు. క్లైమాక్స్ సాంగ్ కు రాయడం తనకు మంచి అనుభూతినిచ్చిందని అన్నారు. మిక్కీ జె.మేయర్ మాట్లాడుతూ, హీరో రామ్ సినిమాకి సంగీతం అందించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందనీ, 'కొత్త బంగారులోకం' తర్వాత గ్యాప్ తీసుకుని ఎంతో కమిట్ మెంట్ తో ఈ సినిమాకి సంగీతం అందించాననీ అన్నారు. తన పాటలు ఎలా చిత్రీకరిస్తున్నారో చూసేందుకు ఆస్ట్రేలియా వెళ్లే అవకాశం కూడా కలిగిందన్నారు. పాటలన్నీ బాగా వచ్చాయనీ, వేర్వేరు గాయకులతో ఈ పాటలు పాటించాననీ అన్నారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|