'గణేష్' పాటలు రిలీజ్
ఎన్టీఆర్ మాట్లాడుతూ, ఇదే ప్లేస్ లో జరిగిన 'రెడీ' ఆడియో వేడుకలోనూ తాను పాల్గొన్నాననీ, తనకు నచ్చిన టాప్ 10 చిత్రాల్లో 'రెడీ' ఒకటనీ అన్నారు. రామ్ లో మంచి ఎనర్జీ ఉందనీ, నటనలో ఈజ్, డాన్సుల్లో చక్కటి ప్రతిభ ద్యోతకమవుతుందనీ అన్నారు. గణేష్ పోస్టర్లలో రామ్ చాలా హ్యాండ్ సమ్ గా కూడా ఉన్నారన్నారు. మిక్కీ జె.మేయర్ అద్భుతమైన సంగీత దర్శకుడని ప్రశంసించారు. రామ్ మాట్లాడుతూ, తారక్ (ఎన్టీఆర్), సురేష్ బాబు ఈ ఫంక్షన్ కు వచ్చినందుకు తన ధన్యవాదాలని అన్నారు. ఈ చిత్రం కోసం 86 రోజులు పనిచేశాననీ, 26 మంది పిల్లలతో తాను కలిసి పనిచేయడంతో వారితో తనకు అటాచ్ మెంట్ పెరిగిందనీ అన్నారు. ఈ సినిమా తర్వాత తాను మిక్కీ జె.మేయర్ ఫ్యాన్ అయ్యానని ప్రశంసించారు. ఎంతో ఎనర్జిటిక్ గా, మెలోడియస్ గా, మాస్ కు నచ్చేవిధంగా ఈ పాటలు ఉంటాయన్నారు. దర్శకుడు తమిళియన్ కావడంతో తాను ఎక్కువ జాగ్రత్త తీసుకున్నానని అన్నారు. తన కెరీర్ ఎదుగులలో పెదనాన్న స్రవంతి రవికిషోర్ వెన్నుదన్నుగా నిలుస్తున్నారని చెప్పారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|