'ఈనాడు' పాటలొచ్చాయి
పద్మశ్రీ కమల్ హాసన్, విక్టరీ వెంకటేష్ కథానాయకులుగా చక్రి తేలేటి దర్శకత్వంలో రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్, రోనీ స్క్రూవాలా నిర్మించిన 'ఈనాడు' చిత్రం ఈనెల 18న విడుదలవుతోంది. అమ్మ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై జి.కుమార్ బాబు తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైద్రాబాద్ లో జరిగింది. ఆడియో సీడీలను దర్శకేంద్రుడు కె.రాఘువేంద్రరావు ఆవిష్కరించి తొలి ప్రతిని నటి గౌతమికి అందజేశారు. కమల్ కుమార్తె శ్రుతిహాసన్ సంగీతం అందించిన ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుదలైంది. కమల్, వెంకటేష్. జి.కుమార్ బాబు, ఎ.కోదండరామిరెడ్డి, పరుచూరి గోపాలకృష్ణ, అచ్చిరెడ్డి, చదలవాడ శ్రీనివాసరావు, చక్రి తోలేటి, శ్రుతిహాసన్, అక్షర హాసన్, గౌతమి కుమార్తె సుబ్బలక్ష్మి, నీలకంఠ, ఆదిత్య మ్యూజిక్ దయానంత్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, కృష్ణతో తాము పనిచేసిన 'ఈనాడు' ఎంత సక్సెస్ అయిందో ఈ చిత్రం కూడా అంతకు మించి సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. కమల్-వెంకటేష్ కలిసి నటించారంటే సినిమాలో ఇద్దరు కమల్ హాసన్లు నటించడంతో సమానమని చమత్కరించారు. 'ఈనాడు' సమాజానికి ఉపయోగపడే చిత్రమనీ, శ్రుతిహాసన్ కు ఇది శుభారంభం కావాలని కోరుకుంటున్నామని నీలకంఠ, అచ్చిరెడ్డి పేర్కొన్నారు. కమల్, వెంకటేష్ లతో కలిసి పనిచేయడం చక్కటి అనుభూతిని కలిగించిందనీ, శ్రుతి హాసన్ మంచి సంగీతం అందించారని చిత్ర దర్శకుడు చక్రి తోలేటి పేర్కొన్నారు. తాను అందించిన సంగీతం అందర్నీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నట్టు శ్రుతిహాసన్ అన్నారు. ఇది తన ఫ్యామిలీ ఫంక్షన్ లాంటిదనీ, శ్రుతి, అక్షరకు మంచి భవిష్యత్తు ఉందనీ గౌతమి పేర్కొన్నారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|