'ఈనాడు' పాటలొచ్చాయి
విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ, ఈనెల 18న సినిమా విడుదలవుతోందనీ, తాను కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాననీ అన్నారు.ఇందులో తనకూ, కమల్ కూ మధ్య ఎక్కువ సన్నివేశాలు లేకపోయినా ఆద్యంతం కనిపిస్తూనే ఉంటాయమనీ, కమల్ తో మరిన్ని చిత్రాలు చేయాలని ఉందని అన్నారు. ఈ చిత్రంలో శ్రుతి సంగీతానికి, ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు మంచి ప్రాధాన్యం ఉందన్నారు. కమల్ మాట్లాడుతూ, ఇందులో నటించడానికి అంగీకరించడం ద్వారా వెంకటేష్ తన స్నేహశీలతను చాటుకున్నారనీ, ఆయనతో ఇంకా ఎన్నో చిత్రాలలో నటించాలని అనుకుంటున్నాననీ అన్నారు. శ్రుతి ప్రతిభావంతురాలు కాబట్టే ఈ చిత్రానికి సంగీతం అందించే అవకాశం లభించిందనీ, ఆమె స్వతంత్రంగా ఈ చిత్రానికి మంచి సంగీతం అందించిందనీ అన్నారు. 'సాగరసంగమం' లో బ్యాడ్ ఫోటోగ్రాఫర్ గా నటించిన చక్రి ఈ సినిమాను చాలా గుడ్ గా రూపొందించారని ప్రశంసించారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|