శ్రీకాంత్ తో సంతోషం స్పెషల్
'మహాత్మ' చిత్రంతో హీరో శ్రీకాంత్ శతచిత్ర నటుడయ్యారు. శ్రీకాంత్ తో తనకున్న అనుబంధాన్ని పురస్కరించుకుని ఆయన 100 చిత్రాల సమాచారంతో 'సంతోషం' సినీ పత్రిక సంపాదకుడు సురేష్ కొండేటి ఓ ప్రత్యేక సంచికను వెలువరించారు. బుధవారంనాడు మార్కెట్ లోకి వచ్చే సంతోషం పత్రికతో పాటు ఈ ప్రత్యేక సంచికను ఉచితంగా అందజేయనున్నారు. హైద్రాబాద్ లో మంగళవారంనాడు జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో శ్రీకాంత్ 100 చిత్రాల ప్రత్యేక సంచిక ఆవిష్కరణ సినీ ప్రముఖుల సమక్షంలో జరిగింది. దర్శకేంద్రుడు కె.రాఘువేంద్రరావు తొలి ప్రతిని ఆవిష్కరించి అల్లు అరవింద్ కు అందజేశారు. శ్రీకాంత్, తమ్మారెడ్డి భరద్వాజ, ఎస్.వి.కృష్ణారెడ్డి, సురేష్ కొండేటి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎస్.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఒక సినిమా పూర్తి చేయాలంటే హీరోలు 6 నెలల నుంచి సంవత్సరం తీసుకుంటున్నారనీ, అలాంటిది శ్రీకాంత్ 100 చిత్రాలు పూర్తి చేయడం ఎంతో విశేషమనీ అన్నారు. తాను తీసిన పలు సినిమాల్లో శ్రీకాంత్ హీరోగా నటించారనీ, ఆయన ఎంతో మంచి వ్యక్తనీ, దర్శక నిర్మాతల హీరో అని కొనియాడారు. 100 సినిమాలు కాదు...ఇంకా ఎన్నెన్నో సినిమాలు శ్రీకాంత్ చేయాలని అభిలషించారు. శ్రీకాంత్ విలన్ గా కెరీర్ ప్రారంభించినప్పటికీ తాను తీసిన 'వన్ బై టు' చిత్రంతో హీరో అయ్యారనీ, హీరో కావాలని వచ్చినప్పుడు ఎంతటి వినయ విధేయలతో ఉన్నారో ఇప్పుడు 100 చిత్రాల తర్వాత కూడా అంతే ఒద్దికగా ఆయన ఉన్నారని ప్రశంసించారు. నిర్మాతలకు ఇలాంటి రీజనబుల్ హీరోలే కావాలనీ, అప్పుడే పరిశ్రమ బాగుంటుందనీ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ, ఈమధ్యన అల్లు అర్జున్ ను నువ్వెన్ని సినిమాలు చేస్తావని అడిగినప్పుడు 20 నుంచి 25 సినిమాలని చెప్పాడనీ, ఇప్పటి హీరోలు సంఖ్యాపరంగా ఎక్కువ సినిమాలు చేయలేకపోతున్నారనీ అన్నారు. ఆచితూచి అడుగులు వేస్తుండటం వల్లనే అలా జరుగుతోందని అన్నారు. అలాంటిది శ్రీకాంత్ 100 సినిమాలు పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. శ్రీకాంత్ చాలా మంచి వ్యక్తి మాత్రమే గాకుండా, తమ కుటుంబంతో చక్కటి అనుబంధం ఉందనీ, చిరంజీవిని అన్నయ్యా అనీ, తనను బావా అనీ అప్యాయంగా పిలుస్తూ కలిసిపోతాడని అన్నారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|