శ్రీకాంత్ తో సంతోషం స్పెషల్
ఈ క్రెడిట్ అందరిదీః శ్రీకాంత్
ఉషాకిరణ్ బ్యానర్ లో తొలుత విలన్ గా పరిచయమైన తాను తమ్మారెడ్డి భరద్వాజ చిత్రంతో హీరో అయ్యానని శ్రీకాంత్ పేర్కొన్నారు. దర్శకేంద్రుడు రాఘువేంద్రరావుతో పనిచేయాలనే కోరిక 'పెళ్లి సందడి'తో తీరిందన్నారు. అలాగే ఇవివి సత్యనారాయణ, ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వంలో 25 సినిమాలు వరకూ చేశానని అన్నారు. కృష్ణవంశీ 'ఖడ్గం' చిత్రం ద్వారా తనను సీరియస్ పాత్రల వైపు మళ్లించారనీ, అదే కృష్ణవంశీ ఇప్పుడు తనకు నూరవ సినిమాగా 'మహాత్మ' వంటి మంచి చిత్రం ఇచ్చారనీ అన్నారు. తనతో పనిచేసిన వారందరూ అందించిన సహకారంతోనే సెంచరీ మార్క్ సాధించగలిగానని అన్నారు.
'సంతోషం' సురేష్ కొండేటి మాట్లాడుతూ, శ్రీకాంత్ తో తనకు 17 సంవత్సరాలుగా మంచి అనుబంధం ఉందని అన్నారు. నర్సాపురంలో జరిగిన తన వివాహానికి స్యయంగా కారు నడుపుకొంటూ శ్రీకాంత్ రావడం తనకు ఇప్పటికీ గుర్తుందనీ, అలాంటి మంచి మిత్రుడుకు ఏదైనా చేసి రుణం తీర్చుకోవాలని అనుకున్నాననీ, ఇప్పుడు శ్రీకాంత్ 100 చిత్రాల సమాచారంతో ప్రత్యేక సంచిక తీసుకురావడం ద్వారా ఆ రుణం తీర్చుకున్నాననీ సంతోషం వ్యక్తం చేశారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|