రామ్ చరణ్ చిత్రం ప్రారంభం
రామ్ చరణ్, జెనీలియా జంటగా భాస్కర్ దర్శకత్వంలో అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ప్రొడక్షన్ నెంబర్ 7 చిత్రం హైటెక్స్ లోని నోవాటెల్ లో బుధవారం ఉదయం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కె.వెంకట్రావు సమర్పణలో కె.నాగేంద్రబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవుని పటాలపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు క్లాప్ ఇవ్వగా, డాక్టర్ డి.రామానాయుడు కెమెరా స్విచ్చాన్ చేశారు. చిరంజీవి, కె.రాఘువేంద్రరావు, అల్లు అరవింద్, వెంకటేష్, శ్రీకాంత్, అల్లు అర్జున్, శివాజీ, మాజీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్, మాజీ మంత్రి హరిరామ జోగయ్య, దర్శకులు కోడి రామకృష్ణ, వినాయక్, రాజమౌళి, క్రిష్, పూరీ జగన్నాథ్, హెహర్ రమేష్, సురేంద్రరెడ్డి, నిర్మాతలు శ్యాంప్రసాద్ రెడ్డి, కె.సి.శేఖర్ బాబు, కె.ఎల్.నారాయణ, దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు.
దాసరి నారాయణరావు మాట్లాడుతూ, ఈ ఫంక్షన్ కు రావడం చాలా హ్యాపీగా ఉందని అన్నారు. రామ్ చరణ్ తొలి సినిమా ఒక సంచలనమైతే, రెండో సినిమా 78 సంవత్సరాల సినీ చరిత్రలో రికార్డ్ సృష్టించిందనీ, ఈ రెండు చిత్రాల తర్వాత వస్తున్న ఈ చిత్రం దర్శకుడు భాస్కర్ పై మరింత బరువు బాధ్యతలను పెంచిందనీ అన్నారు. జనం ఎదురుచూసే హీరోని భాస్కర్ ఎలా తీర్చిదిద్దుతారో చూడాలని అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ, రామ్ చరణ్ తో పాటు భాస్కర్ కు కూడా ఇది మూడో సినిమా అనీ, 'మగధీర' తర్వాత ఈ సినిమా ఎలా ఉంటుందనే ఉత్సాహం ఉంటుందనీ, డైరెక్టర్, హీరో మీద బాగా టెన్షన్ కూడా ఉంటుందనీ అన్నారు. అయితే ఇది మంచి కాంబినేషన్ కావడంతో 100 శాతం విజయం తథ్యమని అన్నారు. నాగబాబు సైతం పెద్ద ఎత్తున ఈ సినిమా తీసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. నాగబాబు మాట్లాడుతూ, ఈ సినిమా తీయడానికి భాస్కర్ వంటి దర్శకుడే కరెక్ట్ అనీ, ఎమోషన్, ఫ్యామిలీ సబ్జెక్ట్ తో ప్రేమకథను ముడిపెట్టి సినిమా తీయడంలో భాస్కర్ కు ప్రత్యేకత ఉందనీ అన్నారు. దర్శకుడిగా భాస్కర్ కావాలని రామ్ చరణ్ కోరుకున్నారని చెప్పారు. ఇదొక రొమాంటిక్ లవ్ స్టోరీ అనీ, సెంటిమెంట్, ఎమోషన్స్ అన్నీ కలగలసి ఉంటాయనీ చెప్పారు. హైద్రాబాద్ లోనే నవంబర్ లో ఒక షెడ్యూల్ ఉంటుందనీ, డిసెంబర్, జనవరిలో ఆస్ట్రేలియా మరో షెడ్యూల్ ఉంటుందనీ తెలిపారు. మిగతా షూటింగ్ హైద్రాబాద్ లో నే ఉంటుందని చెప్పారు. ఇందులో కాజల్ ఉండవచ్చనీ, తాను కూడా నటించే అవకాశాలు లేకపోలేదనీ అన్నారు. బ్రహ్మానందం మరో పాత్ర పోషిస్తున్నారని చెప్పారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|