దాసరి 'యంగ్ ఇండియా' స్టార్ట్
గిన్నెస్ రికార్డ్ హోల్డర్ డాక్టర్ దాసరి నారాయణరావు దర్శకత్వం వహిస్తున్న 149వ చిత్రం 'యంగ్ ఇండియా'. సిరి మీడియో ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శ్రీమతి దాసరి పద్మ సమర్పణలో రామకృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 35 ఏళ్ల క్రితం నవంబర్ 22న దాసరి అంతా కొత్తవారితో తీసిన 'స్వర్గం-నరకం' రిలీజ్ అయి సెన్సేషన్ హిట్ సాధించింది. ఇదే నవంబర్ 22న 'యంగ్ ఇండియా' చిత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. నాటి 'స్వర్గం-నరకం'తో పరిచయమైన మోహన్ బాబు ఈ చిత్రానికి క్లాప్ కొట్టగా, సీనియర్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి స్విచ్చాన్ చేశారు.
దాసరి మాట్లాడుతూ 'మన ఇండియాలోని మానవ వనరులను అమెరికా, యుకె వంటి దేశాలు బాగా ఉపయోగించుకుంటున్నాయి. యువతం కేవలం కేవలం ఎంప్లాయిమెంట్ కే కాదు. దేశ భవిష్యత్తుకు కూడా దిక్సూచి కావాలి. ప్రస్తుత దేశ పరిస్థితులకు యంగ్ ఇండియా ఎలా దిక్సూచి కావాలన్నదే ఈ చిత్ర కథాంశం. అంతా కొత్త వారితో తీస్తున్న ఈ చిత్రంలో నటించడానికి 22 వేల మందికి పైగా అప్లికేషన్స్ పంపారు. కొన్ని నెలల పాటు పరిశీలించి అందులో 540 మందిని ఇంటర్వ్యూలు చేసి ఫైనల్ గా 81 మంది ఎంపిక చేశారు. వీరందిరికీ నటనలో, డాన్స్ లో రెండు నెలల పాటు శిక్షణ ఇచ్చాం. అందులో ఆరుగురు హీరోలు, ఆరుగురు హీరోయిన్లు, ఆరుగురు సపోర్టింగ్ ఆర్టిస్టులు...వెరసి 81 మంది కొత్త వాళ్లను ఒకేసారి పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు వచ్చిన హీరోయిన్స్ దొరకడం లేదని అనే వారికి యంగ్ ఇండియా సమాధానం చెబుతుంది. ఇందులో హీరోయిన్స్ గా పరిచయం అవుతున్న వారంతా తెలుగు వాళ్లే. మీడియాలో అచ్చ తెలుగు మాట్లాడే తెలుగింటి ఆడపడుచులే' అన్నారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|