దాసరి 'యంగ్ ఇండియా' స్టార్ట్
నిర్మాత రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, హైద్రాబాద్, విశాఖపట్నం, ముంబైలలో ఏకధాటిగా 60 రోజుల పాటు ఈ చిత్రం షూటింగ్ జరుగుతుందనీ, మధ్యలో ఓ 5 రోజులు దాసరిగారు పార్లమెంటుకు వెళ్తారనీ చెప్పారు. ఆ చిన్న గ్యాప్ మినహాయిస్తే షూటింగ్ ఆల్ మోస్ట్ సింగిల్ షెడ్యూల్ లో పూర్తవుతుందని అన్నారు. గతంలో ఎన్నో రికార్డులు సృష్టించిన దాసరి ఒకే చిత్రంలో 81 మంది కొత్త ఆర్టిస్టులను పరిచయం చేస్తూ మరో కొత్త రికార్డు సృష్టించారనీ, చాలంకాలం తర్వాత, దాసరి-కీరవాణి కలిసి వర్క్ చేస్తున్నారనీ చెప్పారు. సంగీతానికి చాలా ప్రాధాన్యం ఉంటుందనీ, 6 పాటల్లో 4 పాటల రికార్డింగ్ కూడా పూర్తయిందనీ చెప్పారు. తెలుగు పరిశ్రమలో ఈ చిత్రం ఓ కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేస్తుందని అన్నారు. ఈ చిత్రానికి కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం దాసరి నిర్వహిస్తుండగా, సి.హెచ్.రమణరాజు సినిమాటోగ్రఫీ, గౌతంరాజు ఎడిటంగ్, రాఖీ రమేష్-రామ్-లక్ష్మణ్ ఫైట్స్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|