రానా 'లీడర్' ఆడియో రిలీజ్
దగ్గుబాటి రానా కథానాయకుడుగా పరిచయమవుతున్న 'లీడర్' చిత్రం ఆడియో వేడుక వైస్రాయ్ హోటల్ లో ఆదివారంనాడు పలువురు సినీ ప్రముఖ సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఏవియం ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందింది. మిక్కీ జె.మేయర్ సంగీతం అందించారు. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొని ఆడియో క్యాసెట్ ను రిలీజ్ చేసి తొలి క్యాసెట్ ను డాక్టర్ డి.రామానాయుడుకు అందజేశారు. ఆడియో సీడీని ఏవియం అధినేత శరవణన్ విడుదల చేసి రామానాయుడుకు, చిరంజీవికి అందజేశారు. సినిమాలోని ఒక్కోపాటను ఒక్కొక్కరి చేత రిలీజ్ చేయించారు. తొలి పాటను కృష్ణంరాజు, డివిఎస్ రాజు, ఎం.ఎస్.రెడ్డి రిలీజ్ చేయగా, రెండో పాటను వందేమాతరం శ్రీనివాస్, మూడో పాటను మరళీమోహన్, బిఎన్ రెడ్డి, రవిప్రకాష్, నాలుగో పాటను చిరంజీవి, ఐదో పాటను, అల్లు అర్జున్, ఎం.ఎస్.రాజు, ఆరో పాటను రామానాయుడు-శరవణన్ రిలీజ్ చేశారు. సురేష్ బాబు, శేఖర్ కమ్ముల, వెంకటేష్, నాగార్జున, అల్లు అరవింద్, అశ్వనీదత్, పరుచూరి వెంకటేశ్వరరావు, విష్ణు, శ్యాంప్రసాద్ రెడ్డి, క్రిష్, మెహర్ రమేష్, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, రిచా, ప్రియా ఆనంద్, మిక్కీ జె.మేయర్ తదితరులు పాల్గొన్నారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.
డి.రామానాయుడు మాట్లాడుతూ, 1962లో తాను పరిశ్రమకి వచ్చి 63 నవంబర్ 16న రామారావుగారితో 'రాముడు-భీముడు' తీశాననీ, అప్పట్లో సురేష్ బాబు కాలేజీలో చదుతూ నటన ఇష్టం లేదన్నాడనీ చెప్పారు. ఆ తర్వాత క్రమంలో వెంకటేష్ ఫారిన్ లో ఉన్నప్పుడు నటిస్తావా అని అడగగానే సరేననడంతో 'కలియుగ పాండవులు' వచ్చిందని అన్నారు. ఇప్పుడు తన మనువడు రానా కూడా సినిమా రంగానికి వచ్చాడనీ, దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద బేనర్ అయిన ఏవియం ద్వారా రానాను పరిచయం చేస్తున్నామనీ, అందరూ రానాను సైతం ఆదరించి మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాననీ అన్నారు. వెంకటేష్ మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా తమ సంస్థను, తననూ ఆదరిస్తూ ఎంతో ఎంకరేజ్ మెంట్ ఇచ్చిన ఆంధ్ర ప్రేక్షకులు రానాను కూడా ఆదిరించి సినిమాను హిట్ చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు. ఇంతవరకూ తమని ఆదరించిన ప్రేక్షకులు తన కుమారుడైన రానాను కూడా ఆశీర్వించాలని సురేష్ బాబు కోరారు. రామానాయుడు కుటుంబం నుంచి మూడోతరం కూడా సినిమాల్లోకి అడుగుపెట్టిందనీ, తాతగారిలై క్రమశిక్షణ పుణికి పుచ్చుకుని రాణా కూడా ఇండస్ట్రీకి మంచి నాయకుడు కావాలని ఆశీర్వదిస్తున్నానని కృష్ణంరాజు అన్నారు. రానా తాతగారు, చిన్నాన్న వెంకటేష్ అంత ఎత్తు ఎదగాలని నాగార్జున ఆశీర్వదించారు. తన బెస్ట్ ఫ్రెండ్ రానా ఈ సినిమాతో డిఫెనెట్ హిట్ కొడతాడని అల్లు అర్జున్ పేర్కొన్నారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|