రానా 'లీడర్' ఆడియో రిలీజ్
ఇది తన ఫ్యామిలీ ఫంక్షన్ లాంటిదనీ, ఈ లీడర్ కు సంబంధించిన ప్రతి ఒక్కరితోనూ తనకు అనుబంధం ఉందనీ చిరంజీవి అన్నారు. ఏవీయం వంటి పెద్ద బ్యానర్ లో నటించాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుందనీ, అది రానాకు తొలి సినిమాతోనే నెరవేరిందనీ అన్నారు. ప్రజాశ్రేయస్సు, నిష్కలంక రాజకీయాలు కోరుకునే లీడర్ ఎలా ఉండాలనే కథాశంతో శేఖర్ కమ్ముల తీసిన ఈ లీడర్ మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. శేఖర్ కమ్ముల మాట్లాడుతూ, ఇంతవరకూ చిన్న సినిమాలేచేసిన తాను ఏవియం వంటి పెద్ద బ్యానర్ కు దర్శకత్వ వహించడం అదృష్టమని అన్నారు. 'ఆనంద్' తన కూతురులాంటిదనీ,, 'హ్యాపీడేస్' కొడుకులాంటిదనీ, ఈ 'లీడర్' తన తల్లి లాంటిదని అభివర్ణించారు. ఇవాల్టి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే లీడర్ ఎలా ఉండాలన్నదే ఇందులో చూపించామని అన్నారు. రానా క్రమశిక్షణ ఉన్న కుర్రాడనీ, సినిమా మంచి హిట్ అవుతుందనే గట్టి నమ్మకం తనకుందనీ అన్నారు. రామానాయుడుగారి మనువడు రానాను పరిచయం చేస్తుండటం, శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం చాలా సంతోషంగా ఉందని నిర్మాతల్లో ఒకరైన గుహన్ పేర్కొన్నారు.
రాణా మాట్లాడుతూ, తనను దీవించడానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారమని అన్నారు. నిర్మాతగా తాతను, నాన్నను, హీరోగా చిన్నాన్నను ఆదరించినట్టే ఈ సినిమాతో తనకు కూడా ప్రేక్షకులు తమ గుండెల్లో చోటివ్వాలని కోరారు. తొలి సినిమా కావడంతో కొద్దిగా భయపడినప్పటికీ అందరూ ఎంతో ప్రోత్సహించారనీ, వారందరికీ తన కృతజ్ఞతలనీ అన్నారు. తొమ్మిది నెలల క్రితం విదేశాల్లో ఉన్న తాను
శేఖర్ కమ్ముల చిత్రంలో రానాతో నటిస్తానని అనుకోలేదనీ, అందరికీ తన కృతజ్ఞతలనీ హీరోయిన్ రిచా గంగోపాధ్యయ పేర్కొంది. నటిగా తనకు తొలి అవకాశం ఇచ్చిన శేఖర్ కమ్ములకు తన కృతజ్ఞతలని మరో హీరోయిన్ ప్రియా ఆనంద్ పేర్కొంది.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|