నాగ్ కు గ్రీకు ప్రభుత్వ సత్కారం
హీరో నాగార్జునను గ్రీక్ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. కామాక్షి కళా మూవీస్ పతాకంపై డి.శివప్రసాద్ రెడ్డి నిర్మాతగా కిరణ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'కేడీ' చిత్రం కోసం నాగార్జున గ్రీస్ వెళ్లారు. నాగార్జునకు గ్రీక్ ప్రభుత్వం, మిలోస్ ఐలాండ్ ప్రతినిధులు, ప్రెస్ మీడియా ఘనస్వాగతం చెప్పారు.
మిలోస్ ఐలాండ్ లో జరిగిన సత్కార సభలో గ్రీక్ ప్రభుత్వ ప్రతినిధులు మాట్లాడుతూ, నాగార్జున రాక గ్రీక్ పర్యాటక శాఖకు 'గ్రేడ్ డే'గా భావిస్తున్నామని అన్నారు. నాగార్జున ఇక్కడ షూటింగ్ కు రావడం తమకెంతో గర్వంగా ఉందనీ, ఆయనను సత్కరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామనీ పేర్కొన్నారు. ఈ అవకాశానికి తమకు ఇచ్చిన కామాక్షి కళా మూవీస్, అన్నపూర్ణ స్టూడియోస్ టీమ్ కు తమ ధన్యవాదాలు తెలియజేశారు. 'గ్రీక వీరుడు' నాగార్జున మళ్లీ మళ్లీ గ్రీస్ కు రావాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. గ్రీస్ లో షూటింగ్ చేయడం చాలా హ్యాపీగా ఉందనీ, అన్నివిధాలా సహకరిస్తున్న గ్రీక్ ప్రభుత్వం, గ్రీక్ టూరిజం శాఖకు తన కృతజ్ఞతలనీ నాగార్జున అన్నారు. శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, గ్రీకువీరుడుగా అంతా ముద్దుగా పిలుచుకునే నాగార్జునను గ్రీకు దేశం తమ రాకుమారిడిలా గౌరివించి ఘనంగా సత్కరించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
Pages: 1 -2-
|