దాడి హేయం: మోహన్ బాబు
సమైక్యాంధ్ర కోరుకోవడం అందరి హక్కనీ, అమాయకులైన ప్రజలను రెచ్చగొడుతూ, ప్రజల వెనుక దుష్ట శక్తులను పంపిస్తున్నారా అని ఆయన పరోక్షంగా కెసిఆర్ ను ప్రశ్నించారు. హైద్రాబాద్ ముస్లింల సొత్తు అనీ, ముస్లింల ల్యాండ్ ఇదనీ ఆయన అన్నారు. 32 శాతం ముస్లింలు హైదరాబాద్ లో ఉన్నారనీ, మీరెంత మంది ఉన్నారని యుద్ధవాతావరం సృష్టించదలచుకున్నారు? అని ప్రశ్నించారు. ముస్లింలకు హైదరాబాద్ ఇచ్చి వెళ్లిపోదామంటే అలాగే చేద్దామనీ అన్నారు. చెన్నారెడ్డి గారు ఇక్కడకు రమ్మని పిలిస్తే పరిశ్రమ ఇక్కడకు వచ్చిందనీ, నువ్వేమైనా పిలిచావా? అని పరోక్షంగా కెసిఆర్ ను నిలదీశారు. మద్రాసులో పరిశ్రమ ఉన్నప్పుడు ఎవ్వరూ తెలుగు వాళ్లా ఇంకోటా అని ఏరోజూ ప్రశ్నించలేదని, అలాంటిది తెలుగువారిని తెలుగు వాళ్లు ప్రశ్నించడం ఏమిటని నిలదీశారు. కళాకారులు ఎక్కడ కష్టం ఉంటే అక్కడకు వెళ్తారనీ, తల్లీబిడ్డలు ఒకటిగా ఉండాలనుకోవడం తప్పా అని ప్రశ్నించారు. తమ కుంటుబం రాజోలి గ్రామాన్ని ఆదుకుందనీ, అది తెలంగాణాలోది కాదా అని ప్రశ్నించారు. తెలంగాణలో తనకు ఎందరో బంధువులు, ఎందరెందరో అభిమానులు ఉన్నారనీ, తన సినిమాలు సిల్వర్ జూబ్లీ ఆడాయనీ అన్నారు. 'సమైక్యాంధ్ర కావాలంటే తెలుగు సోదరులంతా ఇంటింటికి ఒకడు రండి. ఈ రోజు నా కూతురు షూటింగ్ జరుపుతుంటే గొడవ చేశారు. బీభత్సం సృష్టించారు. ఇవాళ నాకు జరిగింది. రేపు మీకు జరుగుతుంది. లగడపాటికే ఎందుకు పట్టింది? అనంతరపురంలోనో, వైజాగ్ లో విద్యార్థులకే ఎందుకు పట్టింది? కలిసి మెలిసి ఉండాలనే హక్కు, సమైక్యాంధ్ర కోరుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. రండి...నేను కూడా మీతో దీక్షలో కూర్చుంటాను' అని ఆయన స్పష్టం చేశారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2 -3-
|