దాడి హేయం: మోహన్ బాబు
తల్లిని విడదీయలేరు...
తెలంగాణ గురించి మాట్లాడితే తాము అడ్డుపడలేదనీ, అలాగే సమైక్యాంధ్ర కోసం గళం ఎత్తే తమ హక్కును ఎవరూ అడ్డుకోజాలరనీ అంటూ...ఎన్ని జన్మలెత్తినా తెలుగు తల్లిన విడదీయలేరని మోహన్ బాబు తెగేసి చెప్పారు. షూటింగ్ లను మళ్లీ మళ్లీ ఇక్కడే చేసి తీరుతానని అన్నారు. ఇలాంటివి జరుగుతుంటే ప్రభుత్వం మేలుకొందా? నిద్రపోయిందా తెలియడం లేదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న వారే ప్రజా ప్రతినిధులుగా ఉంటారనీ, ప్రభుత్వాలను నడిపిస్తారనీ, ప్రజలకు కష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత కూడా వారిదేననీ అన్నారు. 'షూటింగ్ లు చేసుకోవడం కళాకారుల వృత్తి. ఎంతమందిని కొట్టగలరు? పార్టీ నాయకులుగా ఉన్నారు. ఉచ్చనీచాలు మరిచిపోవద్దని వారికి చెప్పండి' అని కెఎసిఆర్ కు ఆయన హితవు పలికారు.
రజనీకాంత్, ఎన్టీఆర్, ఎమ్జీఆర్ వంటి వారు ఏ ప్రాంతాల నుంచి వచ్చినా అందర్నీ ఆదరించామనీ, సోనియా గాంధీ ఇటాలియన్ అనీ, ఆమె అందరికీ అమ్మగా ఆదరాభిమానులు చూరగొందనీ అన్నారు. మరి తెలుగువారి మధ్యే ఈ వైషమ్యాలు ఎందుకని ప్రశ్నించారు. 'సమైక్యాంధ్ర కోసం మేము పోరాడతాం. మనమంతా తెలుగు వాళ్లం. మనం మనం కొట్టుకోవడం ఏమిటి? దయచేసి రక్తపాతాలు చేయొద్దు. ఇక్కడ ఎవరూ గాజులు తొడుక్కుని కూర్చోలేదు. అరాచకం వద్దనే చెబుతున్నాను. తెలంగాణ ప్రజలంటే తెలుగు వాళ్లే. అరాచకం సృష్టించే దుండగులకు భయపడేది లేదు. పోలీసు అధికారులలకు కూడా పక్షపాతం వద్దు' అని హితవు చెప్పారు. చివరిగా ఓ మాట చెప్పదలచుకున్నాను... ఈ హైదరాబాద్ ఎవరి సొత్తు కాదు. అందిరి సొత్తు. భారదేశంలో భాగం. హైదరాబాద్ ముస్లిం సోదరులకు ఇచ్చేసి వెళ్లిపోదాం' అని ఆవేశంగా అన్నారు. తెలంగాణ ప్రక్రియ మొదలైందని చిదంబరు చెప్పారు కదా అని అడిగిన ఓ ప్రశ్నకు 'ఆయన వాళ్ల రాష్ట్రాన్ని డవలప్ చేసుకోవడానికి అలా చెప్పారు' అంటూ...చిదంబరమో, పిళ్లైనో చెప్పడం కాదనీ, సరైన వ్యక్తుల నుంచే స్పష్టమైన ప్రకటన వస్తేనే దానికి విశ్వసనీయత ఉంటుందనీ మోహన్ బాబు సూటిగా సమాధానమిచ్చారు.

Be first to comment on this News / Article!
Pages: -1- -2- 3
|