చెన్నైకి షూటింగ్ లు ఛలో!
తెలుగు సినిమా హీరోల్లో ఎక్కువ మంది తెలంగాణేతరులే కావడంతో వారి చిత్రాలు, ప్రొడక్షన్ యూనిట్ లు ప్రత్యేక రాష్ట్ర అనుకూలవాదుల లక్ష్యంగా మారుతున్న పరిస్థితి ఉంది. మహేష్ బాబు, అనుష్క జంటగా నటిస్తున్న ఓ చిత్రం షూటింగ్ కోసం రంగారెడ్డి జిల్లా వికారాబాద్ లో 1.30 కోట్ల రూపాయలతో వేసిన సెట్ కు ఉద్యమకారులు నిప్పుపెట్టారు. మరో సంఘటనలో శంకరరంపల్లిలోని పవన్ కల్యాణ్ ఫామ్ హౌస్ పై దాడి జరిగింది. 'సమైక్య ఆంధ్ర' ప్రచారానికి ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి నిర్ణయం తీసుకోవడంతో ఆయన మేనల్లుడైన అల్లు అర్జున్ 'వరుడు' చిత్రం షూటింగ్ పై ఉద్యమకారులు దాడి చేశారు. దీనికి ముందు రోజే ప్రముఖ నటుడు, నిర్మాత డాక్టర్ మోహన్ బాబు తనయుడైన మంచు మనోజ్ షూటింగ్ ను కూడా అడ్డుకున్నారు. వరుస దాడుల కారణంగా హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న షూటింగ్ లన్నీ నిలిచిపోవడంతో నిర్మాతలు ప్రత్యామ్నాయ లొకేషన్లు అన్వేషించక తప్పని పరిస్థితి ఏర్పడింది. సహజంగానే తెలుగు, కన్నడ చిత్రాలతో చిరకాల బంధం ఉన్న చెన్నైపైనే వీరంతా దృష్టి సారిస్తున్నారు.
80వ దశకం వరకూ దాదాపు తెలుగు సినిమాల షూటింగ్ లన్నీ అప్పటి మద్రాసు లోనే జరిగేవి. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ లకు చెన్నైలోనే సొంత నివాసాలు ఉండేవి. కాంగ్రెస్ హయాంలో చెన్నైరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తెలుగు పరిశ్రమ మద్రాసు నుంచి హైద్రాబాద్ కు తరలి వచ్చేందుకు చొరవ తీసుకున్నారు. స్టూడియోల నిర్మాణం, టెక్నీషియన్లు-ఆర్టిస్టుల హౌసింగ్ కాలనీల ఏర్పాటుకు భూములు, తేలికపాటి రుణాలు అందిస్తామని చెప్పడంతో 80వ దశకం చివర్లో తెలుగు పరిశ్రమ హైద్రాబాద్ కు తరలి వచ్చింది.
Be first to comment on this News / Article!
Pages: -1- 2 -3-
|