రిలీజ్ కు ముందే పైరసీ సీడీ
రాధిక, తానూ కలిసి దాచుకున్న డబ్బును 'జగ్గూభాయ్' చిత్రానికి ఖర్చు చేసినట్టు శరత్ కుమార్ తెలిపారు. 15 కోట్లు పెట్టుబడి పెట్టడం పెద్ద విషయం కాకపోవచ్చనీ, అయితే నటీనటులు, సాంకేతిక నిపుణులు పడ్డ శ్రమంతా పైరసీకారుల కారణంగా బూడిదలో పోసిన పన్నీరవుతుందనీ ఆయన అన్నారు. ముఖ్యమంత్రి సకాలంలో స్పందించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారి చర్యలను రజనీకాంత్ ఖండించారు. ఈ చిత్రంలోని ఇన్ స్పెక్టర్ పాత్ర పది మంది అలెక్స్ పాండ్యన్లు కలిస్తే ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అంత పవర్ ఫుల్ గా ఉంటుదనీ, అలాగే జగ్గూభాయ్ కుమార్తె పాత్ర కూడా చాలా శక్తివంతంగా ఉంటుందనీ అన్నారు. ఈ చిత్రం చాలా పెద్ద సక్సెస్ అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. కమల్ హాసన్ మాట్లాడుతూ, తాను నటించిన 'విక్రమ్' సినిమా విషయంలోనూ ఇలాంటి సమస్యే తలెత్తిందనీ, సినిమా రిలీజైన మరుసటి రోజే వీడియో క్యాసెట్ బయటకు వచ్చేసిందనీ అన్నారు. అప్పటి ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్ కు తాను ఫిర్యాదు చేయడంతో వెంటనే నిందితులను అరెస్టు చేశారనీ, అయితే ఆ మరుసటి రోజే వారు బయటకు వచ్చేశారనీ కమల్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరించారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|